Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-05-30T08:01:01+05:30 IST

నేడు (30-5-2023 - మంగళవారం) ఓ రాశి వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారని.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయన్నారు. ఇక ఓ రాశివారు రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. అలాగే ఒక రాశి వారు కీలక సమాచారం అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

నేడు (30-5-2023 - మంగళవారం) ఓ రాశి వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారని.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయన్నారు. ఇక ఓ రాశివారు రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. అలాగే ఒక రాశి వారు కీలక సమాచారం అందుకుంటారు. ఇక మిగిలిన రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. మార్కెటింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి అనుకూలం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచింది.

MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. ఆ రోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

మనసు ఉల్లాసంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్‌లకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయస్వామిని దర్శించండి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలకు నిధులు సర్దుబాటవుతాయి. సోదరీసోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బోధన, రవాణా, స్టేషనరీ, కమ్యూనికేషన్ల రంగా వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. విలువైన పత్రాలు అందుకుంటారు. దుర్గాదేవిని ఆరాధించండి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రణాళికాబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. రవాణా, బోధన, రక్షణ, సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. విరాళాలు, చందాలకు వెచ్చిస్తారు. దీర్ఘకాలికి పెట్టుబడులకు అనుకూలం. సినీ రాజకీయ రంగాల వారికి అర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. గత అనుభవంతో లక్ష్ల్యాలు సాధిస్తారు.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. బృంద కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. సమావేశాల్లో గౌరవ, మన్ననలు అందుకుంటారు.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు అందుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ రంగ సంస్థల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల ఆ రోగ్యం మెరుగుపుడుతుంది. సంకల్పం నెరవేరతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. రక్షణ, న్యాయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. ప్రయాణాలు, సమావేశాలకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయవిక్రయాలకు అనుకూలం. బీమా, గ్రాట్యుటీ, పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఫర్నీచర్‌ కొనుగోలుకు అనుకూలం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-05-30T08:07:42+05:30 IST