Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-05-31T07:51:39+05:30 IST
నేడు (31-5-2023 - బుధవారం) ఫార్మా, ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాల్లో ఉన్న ఓ రాశివారికి ఆర్థికంగా బాగుంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (31-5-2023 - బుధవారం) ఫార్మా, ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాల్లో ఉన్న ఓ రాశివారికి ఆర్థికంగా బాగుంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
రాజకీయాలు, పబ్లిక్‌రిలేషన్స్, మేనేజ్‌మెంట్ రంగాల వారికి అనుకూలం. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి. ఫార్మా, ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు పూర్తవుతాయి. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా వుంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాదిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో అన్నదమ్ముల సహకారం అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్, బ్యాంకింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ, మన్ననలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
రవాణా, రక్షణ, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంతా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉన్నత విద్య విషయాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గోమాత సేవ శుభం కలిగిస్తుంది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. కోల్పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. దీర్ఘకాలిక ఇన్సూరెన్స్, మూచ్యువ ల్ ఫండ్ పెట్టుబడులు లాభిస్తాయి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. షేర్‌మార్కెట్ లావాదేవీలకు అనుకూలం. జనసంబంధాలు మెరుగవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలస్తాయి. వ్యాపార విస్తరణకు సన్నాహాలు చేస్తారు. సహోద్యోగులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రకటనలు, రవాణా, బోధన, రక్షణ, సృజనాత్మక రంగాల వారికి అనుకూలం. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించి శుభవార్తా అందుకుంటారు.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బీమా, పెన్షన్, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది.
- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ