Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-06-01T07:59:28+05:30 IST
నేడు (1-6-2023 - గురువారం) కొన్ని రంగాల వారికి చాలా బాగుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. కొన్ని రంగాల వారు కలవరపరిచే సమాధానం అందుకుంటారు. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (1-6-2023 - గురువారం) కొన్ని రంగాల వారికి చాలా బాగుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. కొన్ని రంగాల వారు కలవరపరిచే సమాధానం అందుకుంటారు. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. పెట్టుబడులకు అవసరమైన సమాచారం సేకరిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని దర్శించండి.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్, రిటైల్ వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. బదిలీలు, వృత్తి, వ్యాపారాల్లో మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. సాయిబాబా ఆరాధన మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల విద్యా విషయంలో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. టెలివిజన్, విద్యాసంస్థలు, క్రీడలు, రచనా రంగాల వారికి అనుకూల సమయం. ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సాయి దర్శనం శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఇంటికి అవసరమైన ఫర్నీచర్ సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల వైఖరి కొంత మనస్తాపం కలిగిస్తుంది. దత్తకవచ పారాయణ మంచిది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఇంటర్వూలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కలవరపరిచే సమాచారం అందుకుంటారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినీ, రాజకీయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. పెట్టుబడుల విషయంలో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచిది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. మ్యూచ్యువల్ ఫండ్, స్టాక్‌మార్కెట్ పెట్టుబడులపై ఆరా తీస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మానసికంగా ఆ శాంతికి లోనయ్యే అవకాశం ఉంది. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. సినీ, రాజకీయ రంగాల వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. విదేశాల్లో ఉన్న ప్రియతములతో చర్చిస్తారు. భాగస్వామి వైఖరి కొంత మనస్తాపం క లిగిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వారు కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రకటనలు, క్రీడల రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. షిర్డీ సాయిని దర్శించండి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహరాల్లో శుభపరిణామాలు సంభవం. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మనసుకు చికాకు కలిగిస్తాయి. అంచనాలు ఫలించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తాత్రేయ కవచపారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ