Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-06-05T07:46:25+05:30 IST
నేడు (5-6-2023 - సోమవారం) ఓ రాశివారికి వాహన యోగం ఉందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక కొన్ని రంగాలకు చెందిన వారికి అంతా మంచే జరుగుతుందని సూచించారు. అలాగే కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుందట. ఇక మొత్తంగా అన్ని రాశులవారికి నేడు ఎలా ఉందో చూద్దాం.
నేడు (5-6-2023 - సోమవారం) ఓ రాశివారికి వాహన యోగం ఉందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక కొన్ని రంగాలకు చెందిన వారికి అంతా మంచే జరుగుతుందని సూచించారు. అలాగే కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుందట. ఇక మొత్తంగా అన్ని రాశులవారికి నేడు ఎలా ఉందో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పొదుపు పథకాలు, విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. కొత్త వ్యూహాలు అనుసరించి విజయం సాధిస్తారు. రక్షణ, బోధన, న్యాయ, కన్సల్టెన్సీ విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అంచనాలు ఫలిస్తాయి. గోమాత సేవ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రుణాలు, పెట్టుబడులు, షేర్‌మార్కెట్ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గాదేవిని ఆరాధించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బృందకార్యక్రమాలు, వేడుకల కోసం ఖర్చు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, యోగ, ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆలయదర్శనం శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. గత అనుభవంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా వుంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొనండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు, సమావేశాలకు అనుకూలం. వాహన యోగం వుంది. సోదరీ, సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, వేడుకలకు అవసరమైన నిధులు సమకూరతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి. సమావేశాలు, బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్, వైద్యం, రిటైల్ వ్యాపారాల వారికి అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. గో సేవ మంచిది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రియతములకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. వేడుకలు, ప్రద ర్శనల్లో పాల్గొంటారు. రాజకీయ, సినీ రంగాల వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. టెలివిజన్, రచనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రంగాల వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. యూనియన్ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ