రాశిఫలాలు : Horoscope

ABN , First Publish Date - 2023-06-07T08:08:44+05:30 IST

నేడు (7-6-2023 - బుధవారం) ఓ రాశివారికి అదనపు ఆదాయం లభిస్తుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఓ రాశివారికి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయని సూచించారు. ఇక మొత్తంగా అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

రాశిఫలాలు : Horoscope

నేడు (7-6-2023 - బుధవారం) ఓ రాశివారికి అదనపు ఆదాయం లభిస్తుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఓ రాశివారికి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయని సూచించారు. ఇక మొత్తంగా అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. పై అధికారుల సహకారంతో ఉన్నత లక్ష్యాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని రీతిలో విజయాలు సాధిస్తారు.

MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి. 0సమీక్షించుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ లావాదేవీలకు అనుకూలం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. గోసేవలో పాల్గొనండి.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించండి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రేమలు ఫలిస్తాయి. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన, ఆడిటింగ్‌, గార్మెంట్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. గణపతి ఆరాధన మంచిది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరంలో వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పులకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

స్నేహానుబంఽధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంఽధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. కమ్యూనికేషన్‌ రంగంలోని వారికి శుభప్రదం. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, రవాణా, టూరిజం, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహక సమయం. కీలక సమాచారం లభిస్తుంది. ప్రయాణాలు, సమాశాలు, వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. అంచనాలు ఫలిస్తాయి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా వుంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-06-07T08:12:09+05:30 IST