ToothBrush in Bathroom: బాత్రూంలోనే బ్రష్‌లను ఉంచే అలవాటుందా..? అయితే ఇది ఒక్కసారి చదివితీరాల్సిందే..!
ABN , First Publish Date - 2023-10-01T09:56:56+05:30 IST
ఉదయాన్నే బాత్రూమ్ లోకి దూరగానే కాలకృత్యాలు తీర్చుకుని పళ్లు తోమి, స్నానం చేయడం త్వరగా జరిగిపోతుందని చాలామంది బాత్రూమ్ లో బ్రష్ ఉంచుతారు. కానీ..
ప్రతిరోజూ ఉదయం లేవగానే పళ్లు తోముకోవడంతో దినచర్య మొదలవుతుంది. పళ్లుతోముకోవడానికి ఉపయోగించే టూత్ బ్రష్ లు చాలావరకు బాత్రూమ్ లోనే ఉంచుతుంటారు. ఉదయాన్నే బాత్రూమ్ లోకి దూరగానే కాలకృత్యాలు తీర్చుకుని పళ్లు తోమి, స్నానం చేయడం త్వరగా జరిగిపోతుందని చాలామంది బాత్రూమ్ లో బ్రష్ ఉంచుతారు. కానీ ఇలా ఉంచడం వెనుక వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్ లో టూత్ బ్రష్ లు ఉంచడం మంచిది కాదని అంటున్నారు. దీనివెనుక కారణాలు తెలిస్తే మైండ్ బ్లాకవుతుంది. బహుశా టూత్ బ్రష్ ను బాత్రూమ్ లో ఉంచే అలవాటును మానుకోవచ్చు కూడా. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
బాత్రూమ్ లోకి దూరగానే పళ్లు తోమడం, స్నానం చేయడం రెండూ ఒకదాని తరువాత ఒకటి కానిచ్చి బయటకు వచ్చేవారే ఎక్కువ. ఈ కారణంగా బాత్రూమ్ లోనే టూత్ బ్రష్(Toothbrush in bathroom) ఉంచడం చాలామందికి అలవాటైపోయి ఉంటుంది. కానీ టూత్ బ్రష్ ను బాత్రూమ్ లో ఉంచడం ప్రమాదమంటున్నారు వైద్యులు. టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే ఉంచడం వల్ల పూ పార్టికల్స్ అనే సమస్య ఏర్పడుతుందట. ఈ కాలంలో ఇళ్లన్నీ ఇరుకైపోయాయి. వెస్ట్రన్ టాయిలెట్ వినియోగం ఎక్కువయ్యాక అన్ని పనులు స్నానపు గదిలోనే కానిచ్చేస్తున్నారు. మలవిసర్జన తరువాత ఫ్లష్ చేసినపుడు మల కణాలు తుంపర్ల రూపంలో బయటకు వెదజల్లబడుతాయి. ఈ కారణంగా బాత్రూమ్ లోని వాతావరణంలో మల కణాలు వ్యాపిస్తాయి. ఇవి టూత్ బ్రష్ ను ఆవరిస్తాయి.
Viral News: 3 రూపాయల కోసం ఆశపడితే.. చివరకు రూ.25 వేలు మటాష్.. జిరాక్స్ షాపులో కనివీని ఎరుగని ఘటన..!
బాత్రూమ్ లో సాధారణంగా తేమ ఎక్కువగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. టూత్ బ్రష్ బాత్రూమ్ లో ఉంచడం వల్ల టూత్ బ్రష్ మీద బ్యాక్టీరియా చాలా సులువుగా ఏర్పడుతుంది.
మరుగుదొడ్డి అనుసంధానంగా ఉన్న బాత్రూమ్ లలో నీటిని పోసినప్పుడు అందులో వెలువడే తుంపర్లు బాత్రూమ్ గోడలపైన, బాత్రూమ్ లోని ఇతర వస్తువులపైనా పడతాయి. ముఖ్యంగా మూత తెరిచే ఫ్లష్ చేసినప్పుడు ఒక్కోసారి వ్యక్తుల మీద కూడా ఈ నీరు పడుతూ ఉంటుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియాను ఏరోసోలైజ్డ్ బ్యాక్టీరియా(aerosolized bacteria) అని అంటారు. బాత్రూమ్ లు చాలా చిన్నవిగా ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.