Viral Video: పెద్దమనసు చాటుకున్న ఫుట్ బాల్ అభిమానులు.. గ్రౌండ్ లో ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-03-01T15:19:37+05:30 IST

మీ మనసు చాలా పెద్దది అంటూ నెటిజన్లు వీరి మంచి మనసును కొనియాడుతున్నారు

Viral Video: పెద్దమనసు చాటుకున్న ఫుట్ బాల్ అభిమానులు.. గ్రౌండ్ లో ఏం చేశారంటే..

ఫుట్ బాల్(Foot Ball) క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా వీర ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ టర్కీ సిరియా భూకంపం(Turkey, syria Earthquake)లో సఫర్ అయిన చిన్నపిల్లల కోసం చేసిన పని నెటిజన్ల నుండి ప్రశంసలు అందుకుంటోంది. మీ మనసు చాలా పెద్దది అంటూ నెటిజన్లు వీరి మంచి మనసును కొనియాడుతున్నారు.దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకూ వీరు చేసిన మంచిపనేంటి తెలుసుకుంటే..

ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియా లలో సంభవించిన భూకంపం(Earthquake) అక్కడ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎంతోమంది చిన్నపిల్లలు దీనావస్థలో ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. వీటి తాలూకు మరణాలు ఇప్పటికీ ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఈ విపత్తు వల్ల ఎంతో మంది పిల్లలు అనాథలయ్యారు. ఇలాంటి పిల్లలను ఉత్సాహపరిచేందుకు, వారిలో ఒంటరితనాన్ని(Lonelyness) పోగొట్టేందుకు ఫుట్ బాల్ ఫ్యాన్స్ పూనుకున్నారు. ఇస్తాంబుల్ లో టర్కిష్ సాకర్ క్లబ్‌(Turkish saucer club)లు బెసిక్టాస్(Besiktas), అంటాల్యాస్పోర్(Antalyaspor) మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ వొడాఫోన్ గ్రౌండ్(Vodafone Ground) లో జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన వేలాదిమంది ఫుట్ బాల్ అభిమానులు గ్రౌండ్ లో టెడ్డీ బేర్(Teddy Bear) ల వర్షం కురిపించారు. Reuters అనే ట్విట్టర్ యూజర్ అభిమానులు కురిపించిన బొమ్మల వర్షం వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

Read also: Viral Video: ప్రేమించుకున్నారు.. పెళ్ళి చేసుకున్నారు.. అవ్వాతాతల వయసెంతో తెలిస్తే..


కొన్ని వేల సంఖ్యలో పోగయిన ఈ టెడ్డీ బేర్ లు టర్కీ సిరియాలలో ఉన్న పిల్లలకు పంపిణీ చేస్తారని తెలిసింది. కేవలం బొమ్మలు మాత్రమే కాకుండా స్కార్ప్ లు, బేరెట్లు కూడా అభిమానులు తమవంతుగా గ్రౌండ్ లో విసిరారు. పిల్లలకు ఇవి మంచి ఊరట ఇస్తాయని నెటిజన్లు ఫుట్ బాల్ అభిమానులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2023-03-01T15:22:15+05:30 IST