IPL 2023 KKR VS SRH : కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు

ABN , First Publish Date - 2023-04-14T23:43:25+05:30 IST

ఐపీఎల్‌ 16వ సీజన్‌ (IPL 2023).. ఈడెన్‌ గార్డెన్స్‌(Eden Gardens) వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (KKR vs SRH) 23 పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2023 KKR VS SRH : కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు

కోల్‌కతా: ఐపీఎల్‌ 16వ సీజన్‌ (IPL 2023).. ఈడెన్‌ గార్డెన్స్‌(Eden Gardens) వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (KKR vs SRH) 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 205/7 స్కోర్‌కి మాత్రమే పరిమితమైంది.

కోల్‌కతా కెప్టెన్‌ నితీశ్‌ రాణా (75), రింకు సింగ్ (58*), ఎన్ జగదీశన్ (36) రాణించినా జట్టు విజయం సాధించలేకపోయింది. హైదరాబాద్‌ బౌలర్లు మార్కో జాన్‌సెన్ 2, మయాంక్ మార్కండే 2.. భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్‌ తలో వికెట్‌ తీశారు. కాగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో హైదరాబాద్‌, కోల్‌కతా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Updated Date - 2023-04-15T03:59:41+05:30 IST