Share News

The Greatest Rivalry: భారత్-పాక్ రైవల్రీపై క్రేజీ డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:12 PM

India vs Pakistan The Greatest Rivalry: క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారత్-పాకిస్థానే. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ అంటే చాలు.. క్రికెట్ అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. గ్రౌండ్‌లో జరుగుతోంది మ్యాచా? లేక యుద్ధమా? అనే అనుమానం కలుగుతుంది.

The Greatest Rivalry: భారత్-పాక్ రైవల్రీపై క్రేజీ డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
IND vs PAK

క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారత్-పాకిస్థానే. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ అంటే చాలు.. క్రికెట్ అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. గ్రౌండ్‌లో జరుగుతోంది మ్యాచా? లేక యుద్ధమా? అనే అనుమానం కలుగుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు విజయమో.. వీరస్వర్గమో అన్న రేంజ్‌లో పోరాడతారు. సిరీస్, ట్రోఫీల కంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడమే ఇరు టీమ్స్‌కు ప్రతిష్టాత్మకం. ఓడిపోతే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి కాబట్టి పరాజయం అనే ఊసే లేకుండా చూసుకుంటారు ఆటగాళ్లు. ఇంత తోపు రైవల్రీగా పేరు తెచ్చుకున్న భారత్-పాక్ మ్యాచులు ఒక ఓటీటీలోకి వచ్చేశాయి.


ఆ తేదీ నుంచి స్ట్రీమింగ్!

కపిల్ దేవ్ నుంచి సచిన్ టెండూల్కర్ ఎరా వరకు.. మహేంద్ర సింగ్ ధోని నుంచి విరాట్ కోహ్లీ కాలం దాకా పాకిస్థాన్‌తో ఎన్నో ఉత్కంఠ మ్యాచుల్లో తలపడింది టీమిండియా. వీటిల్లో వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్.. ఇలా ఎన్నో మర్చిపోలేని మెగా ఫైట్స్ ఉన్నాయి. కోట్లాది మంది చూసేందుకు ఎగబడటం, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం, స్టేడియంలో యుద్ధ వాతావరణం, కామెంట్రీలో కవ్వింపులు, టెలికాస్టింగ్‌లో పోటీలు, యాడ్స్‌తో రెచ్చగొట్టడాలు.. ఇలా ఈ మ్యాచుల చుట్టూ ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి. వాటన్నింటిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.


వాళ్ల ఇంటర్వ్యూలు కూడా..

క్రికెట్‌లో భారత్-పాక్ మధ్య అంతులేని యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ టీమ్స్ పోటీపడిన ప్రతిసారి గ్రౌండ్ వార్ జోన్‌లా మారుతుంది. అందుకే దీనిపై తయారు చేసిన డాక్యుమెంటరీకి ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్’ అని నామకరణం చేశారు. దీన్ని ప్రముఖ దర్శకుడు చంద్రదేవ్ భగత్, స్టెవార్ట్ సుగ్ తెరకెక్కించారు. ఇందులో మ్యాచులకు సంబంధించిన ఫీడ్‌తో పాటు వెటరన్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, షోయబ్ అక్తర్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్, జావేద్ మియాందాద్, రవిచంద్రన్ అశ్విన్ తదితరుల ఇంటర్వూలు కూడా ఉంటాయి.


ఇవీ చదవండి:

జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. అసలు నిజం ఇదే..

6 మ్యాచుల్లో 5 సెంచరీలు.. ఆర్సీబీ బ్యాటర్ కొత్త చరిత్ర

కొడుకు బౌలింగ్.. తండ్రి క్యాచింగ్.. క్రికెట్‌ హిస్టరీలో ఎప్పుడూ చూడని సీన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 03:29 PM