Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా
ABN , Publish Date - Jan 14 , 2025 | 02:33 PM
అహ్మదాబాద్‌లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో అమిత్‌షా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఆయన వెంటే ఉన్నారు.
అహ్మదాబాద్: సంక్రాంతి పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) ఈ ఏడాది కూడా మకర సంక్రాంతి పర్వదినాన గుజరాత్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. అహ్మదాబాద్‌లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఆయన వెంటే ఉన్నారు. సీఎంతో కలిసి ఉత్తరాయణ్ మహోత్సవ్‌కు కూడా అమిత్‌షా హాజరయ్యారు.
Mahakumbh Mela: మహాకుంభ మేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్! గురువుకు ప్రత్యేక పూజలు!
పండుగ సందర్భంగా శాంతినికేతన్ సొసైటీని పతంగలు, రంగవళ్లులతో తీర్చిదిద్దారు. మహిళలు, పిల్లలు అమిత్‌షాకు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ వాయిద్యాలు, సాంస్కృతిక నృత్యాలతో సందడిగా పండుగ నిర్వహించారు. అమిత్‌షా, ఆయన భార్య సోనాల్‌బెన్ షా పతంగుల వేడుకలో పాల్గొని ఈ ఉత్సవానికి మరింత శోభ చేకూర్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అమిత్‌షా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా సకుటుంబ సమేతంగా జరుపుకోవాలంటూ అందర్నీ ఉత్సాహపరిచారు.
అమిత్‌షాతో పాటు పతంగుల వేడుకలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ మేయర్ ప్రతిభా జైన్, స్థానిక బీజేపీ నేతలు, కౌన్సిలర్లు, ఏఎంసీ అధికారులు హాజరయ్యారు. న్యూ రణిప్, శబర్‌మతి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పతంగ్ మహోత్సవ్‌లోనూ కేంద్ర మంత్రి ఈరోజు పాల్గోనున్నారు. ఉత్తరాయణ్ ఫెస్టివల్‌గా గుజరాత్‌తో ఈ పండుగ జరుపుతుంటారు. పతంగులు ఎగురవేయడం, అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడంతో పండుగ శోభ తారాస్థాయికి చేరుకుంటుంది. ఇళ్లపై నుంచి గాలిపటాలు పోటాపోటీగా ఎగురవేస్తూ చిన్నాపెద్దలంతా కోలాహలంగా ఈ వేడుక జరుపుతుంటారు
ఇవి కూడా చదవండి..
Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు
Read Latest National News and Telugu News