‘సీఎం కప్’ కమిటీ చైర్మన్‌గా జగన్
ABN , First Publish Date - 2023-05-12T03:52:53+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ చైర్మన్‌గా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ చైర్మన్‌గా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ప్రారంభోత్సవం నిర్వహణ, క్రీడాకారులకు వసతి, రవాణా, భోజన తదితర ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించనున్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్‌కు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.