India vs NewZealand: ఆరంభంలోనే న్యూజిలాండ్‌కు షాక్.. 19 పరుగులకే 2 వికెట్లు
ABN , First Publish Date - 2023-10-22T15:13:08+05:30 IST
వరల్డ్ కప్-2023లో (World cup 2023) భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్వల్ప స్కోరుకే ఇద్దరు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించారు.
ధర్మశాల: వరల్డ్ కప్-2023లో (World cup 2023) భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్వల్ప స్కోరుకే ఇద్దరు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించారు. న్యూజిలాండ్ జట్టు స్కోరు 9 పరుగుల వద్ద డేవోన్ కాన్వే(0), జట్టు స్కోరు 19 పరుగుల విల్ యంగ్ (17) వికెట్లు కోల్పోయారు. కాన్వేను హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వెనక్కి పంపించాడు. శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక విల్ యంగ్‌ను అద్భుతమైన బంతితో షమీ ఔట్ చేశాడు. షమీ బంతి అందుకున్న తొలి బాల్‌కే యంగ్‌ను ఔట్ చేయడం గమనార్హం.
కాగా.. 14 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 56/2గా ఉంది. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (21 నాటౌట్), డారిల్ మిచెల్ (14 నాటౌట్) ఆడుతున్నారు.