IPL 2023: బెంగళూరు కెప్టెన్‌కు షాక్.. భారీ జరిమానా.. లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ చేసిన పనికి..
ABN , First Publish Date - 2023-04-11T08:16:00+05:30 IST
సోమవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎన్నో మలుపులు తిరిగింది.
సోమవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎన్నో మలుపులు తిరిగింది. చివరి వరకు బెంగళూరుదే విజయం అనుకుంటే పూరన్ (Nicholas Pooran) సంచలన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అత్యంత భారీ స్కోరు సాధించిన బెంగళూరుకు షాకిస్తూ లక్నో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు (Faf du Plessis) డబుల్ షాక్ తగిలింది.
భారీ స్కోరు సాధించినా అతడి జట్టు మ్యాచ్ గెలవకపోగా, స్లో ఓవర్ రేట్ (slow over-rate) కారణంగా డుప్లెసిస్‌కు జరిమానా పడింది. బెంగళూరు బౌలింగ్ చాలా నెమ్మదిగా సాగడంతో ఐపీఎల్ యాజమాన్యం కెప్టెన్ డుప్లెసిస్‌కు ఫైన్ (Fine) వేసింది. ఈ సీజన్‌లో ఇదే తొలి తప్పిదం కాబట్టి రూ.12 లక్షల జరిమానా విధించింది. అలాగే చివరి బంతికి విజయం సాధించడంతో లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ (Avesh Khan) మైదానంలో కాస్త అతిగా ప్రవర్తించాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే సంతోషం పట్టలేక తన హెల్మెట్‌ను నేలకు విసిరి కొట్టాడు. అయితే అతడి మొదటి తప్పిదంగా భావించి మందలించి వదిలేశారు.
Yash Dayal: ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు.. రింకూ బాధితుడు యశ్ దయాల్‌కు మద్దతు.. అతడి తండ్రి ఏమన్నారంటే..
సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు కోహ్లీ (61), డుప్లెసిస్ (79 నాటౌట్), మ్యాక్స్‌వెల్ (59) రాణించడంతో మొత్తం 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన లక్నో టీమ్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా స్టోయినిస్ (65), పూరన్ (62) సంచలన ఇన్నింగ్స్‌లతో మరపురాని విజయం సాధించింది.