ఉష రికార్డు త్రుటిలో మిస్
ABN , First Publish Date - 2023-09-12T01:26:41+05:30 IST
మహిళల 400 మీ. హర్డిల్స్‌లో స్ర్పింట్ లెజెండ్ పీటీ ఉష 39 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ..

చండీగఢ్: మహిళల 400 మీ. హర్డిల్స్‌లో స్ర్పింట్ లెజెండ్ పీటీ ఉష 39 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టే అవకాశం తమిళనాడు రన్నర్ విద్య రామ్‌రాజ్‌కు త్రుటిలో చేజారింది. సోమవారం ఇండియన్ గ్రాండ్ ప్రీ-5లో జరిగిన 400 మీ. హర్డిల్స్‌లో విద్య 55.43 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిచింది. అయితే, 0.01 సెకన్ల తేడాతో జాతీయ రికార్డును నెలకొల్పే అవకాశాన్ని కోల్పోయింది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఉష 55.42 సెకన్లతో అత్యుత్తమ టైమింగ్ సాధించింది. కాగా, విద్య ఆసియా క్రీడలకు ఎంపికైన భారత బృందంలో సభ్యురాలు.