CM KCR: ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు
ABN , First Publish Date - 2023-11-27T22:57:55+05:30 IST
ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చేందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. సోమవారం నాడు సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీ మైదానంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు ఈ సభకు హాజరైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థి చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా : ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చేందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. సోమవారం నాడు సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీ మైదానంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు ఈ సభకు హాజరైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థి చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ఎలక్షన్లు వస్తుంటాయి..పోతుంటాయి. బీఆర్ఎస్ ( BRS ) పుట్టింది తెలంగాణ కోసం. బీఆర్ఎస్ ( BRS ) పార్టీ 15 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చింది. ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారు. 58 ఏళ్లు ఏన్నో గోసలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలి. ఆలోచించి ఓటు వేయాలి..ఓటే మనకు వజ్రాయుధం. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నాడు. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ ( BRS ) గెలవాలి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 24 గంటల కరెంట్ వద్దని మాట్లాడుతున్నారు. మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చాను. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే..
ధరణి తీసేస్తే రైతుబంధు రాదు. దళారుల రాజ్యం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. గవర్నర్ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది.. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తాం. సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ..నా జిల్లా. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ని ఓడగొట్టినా నేను ఏమి మనసులో పెట్టుకోలేదు. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ..ఎంత సేపు మసీదులు తవ్వుదామా ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్లకి పని. సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుంది. సంగారెడ్డికి మెట్రో వస్తే దశ మారిపోతుంది. మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే...రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో వేయవచ్చు. ఎస్పీ కారుని గుద్దినా, నా ఓట్లు నేనే గుద్దుకున్నా అన్న ఎమ్మెల్యే కావాలా. ఈ ఉద్యమ ద్రోహి మొదట బీఆర్ఎస్ ( BRS ) లోనే ఉండేది. ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడు. 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.