E-racing: ఫార్ములా-ఈ రేసింగ్‌ ప్రాక్టీస్‌లో ప్రమాదం

ABN , First Publish Date - 2023-02-10T18:33:55+05:30 IST

హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ (E-racing) ప్రాక్టీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

E-racing: ఫార్ములా-ఈ రేసింగ్‌ ప్రాక్టీస్‌లో ప్రమాదం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ (E-racing) ప్రాక్టీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మూలమలుపు దగ్గర కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనతో ప్రాక్టీస్ రేసుకు నిర్వాహకులు బ్రేక్ ఇచ్చారు.

అంతకు ముందుట్రాక్‌పైకి సాధారణ వాహనాలు రావడంతో వాయిదా పడింది. ఒక్కసారిగా ట్రాక్‌ మీదకు వచ్చిన సాధారణ వాహనాలు వచ్చాయి. సాధారణ వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు టెన్షన్ పడ్డారు. ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో సాధారణ వాహనాలను అనుమతించిన కానిస్టేబుల్‌ (Constable)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్‌ జరుగుతుండడంతో మంగళవారం నుంచి సాగర తీరం చుట్టూ (ట్యాంక్‌బండ్‌ మినహా) వాహనాలను మళ్లించి ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి ఈవెంట్‌ కావడంతో ఆ స్థాయిలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కార్‌ రేస్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులతోపాటు పోటీల్లో పాల్గొనేందుకు పలు సంస్థలు, రేసర్లు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

దూసుకుపోయే ఫార్ములా-1 కార్‌ రేసింగ్‌ను అప్పట్లో టీవీలలో తప్ప భారత క్రీడాభిమానులు ప్రత్యక్షంగా చూసి ఎరుగరు. కానీ దశాబ్దం కిందట స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ (Sports fans)కు ఆ కార్ల పరుగులను ప్రత్యక్షంగా తిలకించే చాన్స్‌ లభించింది. 2011 నుంచి వరుసగా మూడేళ్లపాటు నోయిడాలోని బుద్ధ సర్క్యూట్‌(Buddha Circuit)పై ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా వన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్ (Championship) జరిగింది. సెబాస్టియన్‌ వెటెల్‌ తదితర దిగ్గజ రేసర్ల డ్రైవింగ్‌ విన్యాసాలను చూసి మన క్రీడాభిమానులు అచ్చెరువొందారు. అయితే కొన్ని కారణాలతో 2014 నుంచి ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ నిర్వహించలేదు. ఇక సీన్‌ కట్‌ చేస్తే ఆ స్థాయి కాకపోయినా.. అంతర్జాతీయ మోటార్‌ కార్‌ రేసింగ్‌ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్‌ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్‌ చాంపియన్‌‌షిప్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. రేస్‌ను 20వేల మంది ఫ్యాన్స్‌ తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పోటీలకు సర్వం సిద్ధమైంది.

Updated Date - 2023-02-10T18:40:04+05:30 IST