వంకాయ.. ఇదేం మాయ!
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:32 PM
మండలంలోని 11 గ్రామాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో వంకాయ సాగు చేశా రు. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అది ఎంతో కాలం నిలవ లేదు.

కిలో రూ.4
ఆవేదన చెందుతున్న రైతులు
మద్దికెర, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 11 గ్రామాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో వంకాయ సాగు చేశా రు. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అది ఎంతో కాలం నిలవ లేదు. ధర అమాంతం పడిపోవడంతో దిక్కుతోచడం లేదు.
వంకాయ సాగు
వంకాయ సాగుకు రైతులు ఎకరాకు రూ. రూ.15 నుంచి 20వేల వరకు ఖర్చు చేశారు. విత్తనం, ఎరువులు, పురుగుమందులు ఇలా ఖర్చు చేశారు.
పడిపోయిన ధర
దిగుబడి వచ్చే సమయానికి ధర అమాంతం పడిపోయింది. రైతులకు కన్నీరు మిగిలింది. 20 కిలోల బ్యాగ్ కేవలం రూ.70 నుంచి రూ.80లు పలక డంతో ఏం చేయాలో తెలియక రైతులు అల్లాడుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాగానే వంకాయ దరలు అమాంతం పెరుగుతాయి. ఇందుకు భిన్నంగా ఈసారి ధరలు తగ్గిపోయానని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రవాణా ఖర్చులు అదనం
దిగుబడిని గుంతకల్లు, పత్తికొండ, కర్నూలు, ఆదోనికి తరలించాలంటే రవాణా చార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచకరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
20 కిలోల బ్యాగ్ రూ.80లే..
మూడెకరాల్లో వంకాయ సాగు చేశాను. వంకాయలు కోత కోసి గుంతకల్లు మార్కెట్‌కు తరలించగా.. 20 కిలోల సంచి రూ.80లకు పలికింది. రవాణా చార్జీలు, కూలీలు లెక్కిస్తే పెట్టుబడులు కూడా రావడం లేదు. - రామాంజనేయులు, రైతు, మద్దికెర