Hyderabad: శివారులో చిరుత సంచారం క‌ల‌క‌లం

ABN , First Publish Date - 2023-04-20T12:51:43+05:30 IST

హైద‌రాబాద్: శివారులో చిరుత సంచారం (Leopard Migration) క‌ల‌క‌లం సృష్టిస్తోంది. బౌరంపేట ఓఆర్ఆర్ ప్రాంతంలో చిరుత కదలకలు కనిపించాయి.

Hyderabad: శివారులో చిరుత సంచారం క‌ల‌క‌లం

హైద‌రాబాద్: శివారులో చిరుత సంచారం (Leopard Migration) క‌ల‌క‌లం సృష్టిస్తోంది. బౌరంపేట ఓఆర్ఆర్ ప్రాంతంలో చిరుత కదలకలు కనిపించాయి. సీసీ కెమెరా (CC Camera)ల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు (Forest Officials) అప్రమత్తమయ్యారు. చిరుత సంచరిస్తున్న ఓఆర్ఆర్ పరిసరాలను జల్లెడపడుతున్నారు.

నిన్న రాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌరంపేట, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శివారులో చిరుత సంచరిస్తోందని సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు కనిపించాయంటూ ఆ వీడియోను అధికారులకు పంపారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కోసం వేట కొనసాగించారు. అయితే అక్కడ కనిపించిన ఆనవాళ్లు చూస్తే అది చిరుత కాదని.. మిగతా క్లూస్ సేకరిస్తున్నారు. కాగా అక్కడ కుక్కల సంచారం ఎక్కుగా ఉందని, అడుగులు కూడా కొంత డిస్టర్బుగా ఉన్నాయని.. చిరుత సంచారం ఉందా? లేదా? అన్న అనుమానం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ పరిసరం అటవీప్రాంతం కావడంతో చిరుత నీటి కోసం వచ్చిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Updated Date - 2023-04-20T12:52:31+05:30 IST