ఫ్యాషన్ టస్సర్ ట్రెండ్
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:00 AM
ప్రత్యేకమైన ఆకృతి, సహజసిద్ధమైన స్వర్ణం మెరుపులను కలిగిన అద్భుతమైన వస్త్రమే టస్సర్. వైల్డ్ సిల్క్‌తో తయారయ్యే టస్సర్ చీరలకు ఎన్నో ప్రత్యేకతలుంటాయి...

హూందాగా, విలాసవంతంగా కనిపించాలనుకుంటే టస్సర్ చీరలు కట్టాలి. అన్ని రకాల వేడుకలకూ నప్పే టస్సర్ చీరల సొబగుల గురించి తెలుసుకుందామా?
ప్రత్యేకమైన ఆకృతి, సహజసిద్ధమైన స్వర్ణం మెరుపులను కలిగిన అద్భుతమైన వస్త్రమే టస్సర్. వైల్డ్ సిల్క్‌తో తయారయ్యే టస్సర్ చీరలకు ఎన్నో ప్రత్యేకతలుంటాయి.
వైల్డ్ సిల్క్: యాంథెరీ మాత్‌ల గూళ్ల నుంచి సేకరించిన పట్టుతో వైల్డ్ పట్టును తయారుచేస్తారు. ఈ వైల్డ్ పట్టు పురుగులు మల్బరీ ఆకులు మినహా ఇతరత్రా ఆకులను తింటాయి
టెక్స్‌చర్: కాస్త గురుకుగా ఉండే ఈ వస్త్రం, సుతిమెత్తని మల్బరీ పట్టుకు భిన్నంగా ఉంటుంది
మెరుపు: ఈ పట్టు సహజసిద్ధ బంగారు మెరుపు కలిగి ఉంటుంది
రంగు: బీజ్, క్రీమ్, గోధుమ రంగుల్లో తయారవుతుంది
డిజైన్: సంప్రదాయ బెంగాలీ టస్సర్ చీరలు, నేత బార్డర్లు, కొంగులను కలిగి ఉంటాయి. అలాగే చీర మొత్తం పూల మోటి్‌ఫ్సను కలిగి ఉంటాయి
పేర్లు: టస్సర్ సిల్క్‌నే కోసా సిల్క్ అని కూడా అంటారు ప్రత్యేకతలివే!
సహజ సిద్ధం: ఈ పట్టు తయారీలో సహజరంగులనే ఉపయోగిస్తారు
ఫ మన్నిక: టస్సర్ పట్టు ఎంతో మన్నికైనది. దీనికి ముడతలు, చిరుగులు ఏర్పడవు
ఫ వైవిద్యం: సాధారణ వేడుకలు మొదలు, పెళ్లిళ్లు, పండగలకు కూడా ఈ చీరలెంతో చక్కగా సూటవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News