Share News

జ్ఞాపకశక్తి మందగిస్తోందా..!

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:51 AM

మనం చేసే చిన్న చిన్న పొరబాట్లవల్ల మెదడు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

జ్ఞాపకశక్తి మందగిస్తోందా..!

మనం చేసే చిన్న చిన్న పొరబాట్లవల్ల మెదడు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • ప్రతిరోజూ ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవాలి. దీనివల్ల మెదడుకి కావాల్సిన గ్లూకోజ్‌ అందుతుంది. ఇది ఏకాగ్రతని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

  • పడుకునే ముందు ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను చూస్తూ ఎక్కువ సమయం గడపకూడదు. వీటి నుంచి వచ్చే కాంతి వల్ల మెదడులో మెలటోనిన్‌ ఉత్పత్తి క్షీణిస్తుంది. నిద్రించే సమయం కూడా తగ్గడంతో మెదడు అలసిపోయి గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ప్రతిరోజూ కనీసం ఆరు గంటలు ప్రశాంతంగా నిద్రించాలి.

  • చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. దీనివల్ల మెదడులో వాపు సమస్యలు వచ్చి జ్ఞాపకశక్తి మందగిస్తుంది.

  • ఒకేసారి ఎక్కువ పనులు చేస్తూ ఉంటే మెదడు త్వరగా అలసిపోతుంది. ఇలాంటప్పుడు కూడా ఏమీ గుర్తు ఉండవు. కాబట్టి మల్టీ టాస్కింగ్‌ చేయవద్దు.

  • నిర్జలీకరణ వల్ల కూడా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి.


  • శరీరంలో డి విటమిన్‌ లోపించినా ఏమీ గుర్తుండవు. కాబట్టి ప్రతిరోజూ ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి.

  • దగ్గరి బంధువులు, స్నేహితులకు సంబంధించిన పుట్టిన రోజు తేదీలు, ఫోన్‌ నెంబర్లు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయడం; మెదడుకి పనిచెప్పే చదరంగం, వైకుంఠపాళి, క్యారమ్స్‌ లాంటి ఆటలు ఆడడం; జీపిఎస్‌ విధానాన్ని ఉపయోగించ కుండా దారులు గుర్తుంచుకోవడం లాంటివి అనుసరిస్తూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:51 AM