బీజేపీ, బీఆర్‌ఎస్‌ అవిభక్త కవలలు

ABN , First Publish Date - 2023-03-11T01:22:15+05:30 IST

తెలంగాణ సమాజం ఎవరూ ఆ కుటుంబం కోసం సానుభూతి చూపించాల్సిన పనిలేదని.. ఆ కుటుంబం ఏదో స్వతంత్రం కోసం కొట్లాడో..తెలంగాణ కోసం సచ్చిపోయో..లేకపోతే పా కిస్థాన్‌తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరని.. అవినీతికి, అక్ర మా లకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి.. ఆ సంపాదన పం పకా ల్లో విభేదాలు ఏర్పడి..ఈడీకో.. మోదీకో..కేడీకో తేడాలు వచ్చి ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలు స్పందించాలంటున్నారని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వేర్వేరు కాదని.. వాటి ఆలోచన ఒక్కటేనని.. కాబట్టి బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలని ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవం త్‌రెడ్డి విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అవిభక్త కవలలు

- గల్లీలో అయ్య లిక్కర్‌ దందా చేస్తే..ఢిల్లీలో బిడ్డ లిక్కర్‌ స్కాం

- కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

- 2024 జనవరి 1వ తేదిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం

- జగిత్యాల కార్నర్‌ మీటింగ్‌లో టీపీసీసీ నేత రేవంత్‌ రెడ్డి

జగిత్యాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమాజం ఎవరూ ఆ కుటుంబం కోసం సానుభూతి చూపించాల్సిన పనిలేదని.. ఆ కుటుంబం ఏదో స్వతంత్రం కోసం కొట్లాడో..తెలంగాణ కోసం సచ్చిపోయో..లేకపోతే పా కిస్థాన్‌తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరని.. అవినీతికి, అక్ర మా లకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి.. ఆ సంపాదన పం పకా ల్లో విభేదాలు ఏర్పడి..ఈడీకో.. మోదీకో..కేడీకో తేడాలు వచ్చి ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలు స్పందించాలంటున్నారని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వేర్వేరు కాదని.. వాటి ఆలోచన ఒక్కటేనని.. కాబట్టి బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలని ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవం త్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత్‌ జోడో..హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల మండలం చల్‌ గల్‌ నుంచి పట్టణంలోని గాంధీనగర్‌, ఇందిరానగర్‌, లడ్డు ఖాజా చౌరాస్త, టవర్‌ చౌరస్తా, రాంబజార్‌ మీదుగా కొత్త బస్టాండు వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండు వద్ద నిర్వహించిన కార్నర్‌ మీ టింగ్‌లో ప్రజలనుద్ధేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై కోప తో బీజేపీ వైపు చూడవద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 3 వేల వైన్స్‌ దుకాణాలు, 60 వేల బెల్టు దుకాణాలు తెరిచారని విమర్శించారు. గల్లీ లో అయ్య లిక్కర్‌ దందా చేస్తే తానేం తక్కువ కాదన్నట్లు ఢిల్లీలో లిక్కర్‌ స్కాం చేయడానికి ఆయన బిడ్డ ఎమ్మెల్సీ కవిత వెళ్లారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం అక్రమాలకు, అవినీతికి పాల్పడి లంచం ఇచ్చి దొరికా రని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ చెపుతోందన్నారు. గతంలో రాష్ట్రప తి ఎన్నికలు, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ, నోట్ల రద్దు తదితర అంశాల లో సీఎం కేసీఆర్‌ బీజేపీకి మద్దతు పలికారని గుర్తుచేశారు. ప్రస్తుతం బీజే పీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నాటకాలు ఆడుతున్నాయ న్నారు. సీఎం కేసీఆర్‌ దోపిడి, అవినీతికి సంబందించి ప్రస్తుతం ఈడీ విచా రణ జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలను వేధించిన ప్ర ధాని నరేంద్ర మోదీ గతంలో సోనియా గాంధీని ఈడీ కార్యాలయానికి పిలి పించిన సం దర్భంగా సీఎం కేసీఆర్‌ లాంటి కేడీ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితపైకి వస్తే కేసీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా రని విమర్శించారు. గతంలో మోదీతో జతకట్టిన కేసీఆర్‌కు ప్రస్తుతం తా మెందుకు మద్దతు ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఏమీ సంబంధం అని ప్రశ్నించారు. గతంలో మంద కృష్ణ మాదిగను చర్లపల్లి జైలులో ఉంచినప్పుడు, విమలక్కపై చర్యలు తీ సుకున్న సందర్బంలో, తీన్మార్‌ మల్లన్న, రవి ప్రకాశ్‌ను జైళ్లో పెట్టినప్పుడు సీఎం కేసీఆర్‌ విజ్ఞత ఎటుపోయిందన్నారు. విమలక్కకు ఒక న్యాయం.. కల్వకుంట్ల కవితకు ఇంకొక న్యాయమా అని అడుగుతున్నానని అన్నారు. కో దండరాం లాంటి వారిని సైతం అరెస్టు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రజలకు జ వాబు చెప్పాలన్నారు. ఈ పాపాలన్ని ఊరకనే పోతయా..తన వరకు వస్తే గానీ సీఎం కేసీఆర్‌కు తెలవలేదా అని ప్రశ్నించారు. పలు ప్రాంతాల్లో నిరు పేదల భూములను ప్రాజెక్టుల కోసం లాక్కోవడంతో పాటు మాస్టర్‌ ప్లాన్‌, జోన్ల విభజన పేరిట మరోమారు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తదుపరి పేదలు ఇళ్లు కట్టుకోవ డానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని మరోమారు బలోపేతం చేస్తామని హామీనిచ్చారు. 2018 ఎన్నికల్లో రైతుల కు రూ. లక్ష రుణ మాఫీ చేస్తానని హామీనిచ్చిన సీఎం కేసీఆర్‌ మాట త ప్పారన్నారు. ప్రస్తుతం రైతులు బ్యాంకుల్లో ఎలాంటి రుణాలు చెల్లించ వద్దని, రానున్న ఎనిమిది నెలల్లో క్రాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తదుపరి రూ. రెండు లక్షల వరకు రుణాలు రైతుల తరపున చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, సంవత్సరంలోపు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీచేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తదుపరి వంట గ్యాస్‌ సిలెండర్లను రూ. 500కు ఇంటికి తీసుకొచ్చి ఇస్తా మని ఆడబిడ్డలకు హామీనిచ్చారు. ఎన్‌డీఎస్‌ ఎల్‌ కర్మాగారాలను తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తెరుస్తా మని, కాంగ్రెస్‌ మెనిఫెస్టోలో చేరుస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

2024 జనవరి 1 రోజున తప్పనిసరిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ర్పడుతందని ధీమా వ్యక్తం చేశారు. చెరుకు కర్మాగారాలను నడిపించి, తె లంగాణలో ఉన్న పసుపు రైతులను, చెరుకు రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపె ట్టిన బడ్జెట్‌లో సీఎం కేసీఆర్‌ చేతికి రూ. 23 లక్షల కోట్లు వస్తే కనీసం ప్ర జలకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. సంబంది త నిధులు ఎక్కడికి పోయాయని, ఎవరు తిన్నారని ప్రశ్నించారు. రైతు రు ణ మాఫీ పేరిట అన్నదాతలను మోసాలకు గురిచేస్తున్నారని ఆరోపించా రు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలంగాణ ఏర్పాటుకు కృషి చే శారన్నారు. అధికారంలోకి వచ్చిన తదుపరి వంద రోజుల్లో నిజాందక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ తెరుస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత మాట తప్పిందన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న హామీని ఎంపీ అర వింద్‌ పట్టించుకోవడం లేదన్నారు.

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిని కొనియాడిన రేవంత్‌ రెడ్డి..

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సాదాసీదాగా జీవనం గడుపుతున్నారని తెలిపారు. జీవనన్న ఇంటికి వెళ్తే చెక్క కుర్చి, చెక్క టేబుల్‌ వద్ద కుర్చొని ప్రజా సమస్యలపై పోరాడుతున్నారన్నారు. జీవన్న జీవితాన్ని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రానున్న ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌ రెడ్డిని 50వేల మెజార్జీతో గెలిపించి శాసన సభకు పంపాలని ప్రజలను కో రారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మె ల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధ ర్‌ బాబు, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కిసాన్‌ సెల్‌ నాయ కులు వాకిడి సత్యంరెడ్డి, డాక్టర్‌ మల్లురవి, ఆది శ్రీనివాస్‌, మేడిపల్లి సత్యం, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తాటిపర్తి విజయలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-11T01:22:15+05:30 IST