మధ్యాహ్నానికే మూతపడ్డ కళాశాల
ABN , First Publish Date - 2023-01-20T23:24:19+05:30 IST
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల శుక్రవారం మధ్యాహ్నానికే మూత బ డింది.
దుమ్ముగూడెం జనవరి 20: దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల శుక్రవారం మధ్యాహ్నానికే మూత బ డింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం నాల్గు గంటల వరకు నడవాల్సిన కళాశాల మద్యాహ్నం భోజన విరామ సమయం అనంతరం విద్యార్దుల్ని ఇంటికి పంపించి తర గతి గదులకు తాళం వేశారు. విద్యార్దులు సక్రమంగా హాజరు కావడంలేదనే నెపంతో గత కొద్దిరోజులుగా ఇదే త రహాలో మధ్యాహ్నం నుంచి విద్యార్దుల్ని ఇళ్లకు పంపు తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్ణీత సమయం ముగిసేం తవరకూ కళాశాలలో ఉండాల్సిన అధ్యాపకుల్లో సైతం కొం దరు విద్యార్దులతోపాటే ఇళ్లకు ఉడాయించినట్లు సమా చారం. మార్చిలో సంవత్సరాంతపు పరీక్షలు, కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండగా, కళాశాల నిర్వాహణ తీరు అధ్వాన్నంగా ఉండడం విమర్శలకు దారితీస్తోంది. ఇంటర్ ప్రధమ సంవత్సర విద్యార్థులు 156, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 132 మంది పరీక్ష ఫీజు చెల్లించగా, గత కొద్ది రోజులుగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో కళాశాల తరగతులకు గైర్హాజరౌతున్నారు. శుక్రవారం మొత్తం 32 మంది విద్యార్దులు మాత్రమే పాఠశాలకు రాగా, వారిని సై తం కళాశాల సమయం ముగియకుండానే వదిలేశారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు విద్యార్ధుల్ని ఇళ్లకు పంప డాన్ని కొందరి తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ఇళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులకు కళాశాల సమయంలో దారిలో ఏదై నా జరిగితే దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. ఎలాగోలా పాసవుతామనే ధీమాతో కొందరు విద్యార్దులుం డగా, దీన్ని అలుసుగా తీసుకొని మరి కొందరు విద్యార్దులు సక్రమంగా కళాశాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. అలాగే కొందరు అధ్యాపకులు సైతం కళాశాల సమయాలు పాటించకుండా పరస్పర సహకారంతో తమ ఇష్టారీతిన విధులకు వచ్చి పోతున్నట్లు సమాచారం. గతంలో మంచి ఫలితాలు సాధించిన కళా శాల నిర్వాహణ తీరుపై ఉ న్నతాధికారులు దృష్టి కేటా యించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయ మై ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ను వివరణ కోరగా, తాను ఒక రోజు శెలవులో ఉన్నట్లు తెలిపారు. ఏమి జరిగిందో వి షయం తెలుసుకుంటానని ఆయన పేర్కొన్నారు.