ఎవరికి దక్కేను?

ABN , First Publish Date - 2023-08-21T01:20:45+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిత్వాల కోంం అన్ని పార్టీల్లోని ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార బీఆర్‌ఎస్‌ తన అభ్యర్థుల తొలిజాబితాను సోమవారం ప్రకటించబోతోందన్న నేపథ్యంలో ఆ జాబితాల్లో చోటెవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మళ్లీ ఛాన్స్‌ ఎవరెవరికి దుక్కుతుందోనన్న చర్చ జరుగుతోంది.

ఎవరికి దక్కేను?

ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ

నేడు తొలిజాబితా వెలువడే అవకాశం

ఖమ్మం/ కొత్తగూడెం (ఆంధ్రజ్యోతిప్రతినిధి), అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిత్వాల కోంం అన్ని పార్టీల్లోని ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార బీఆర్‌ఎస్‌ తన అభ్యర్థుల తొలిజాబితాను సోమవారం ప్రకటించబోతోందన్న నేపథ్యంలో ఆ జాబితాల్లో చోటెవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మళ్లీ ఛాన్స్‌ ఎవరెవరికి దుక్కుతుందోనన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే ఇటు మీడియా.. అటు సోషల్‌మీడియా వేదికగా చర్చోపచర్చలు జరుగుతుండగా.. వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడంలేదన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇదే క్రమంలో కొత్తగూడెంలో వైద్యారోగశాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆకస్మికంగా గడపగడపకు గడల పేరుతో ప్రచారం చేపట్టడంతో ఈ సీటుపైనా గందరగోళం నెలకొంది. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి పేర్లు ఖరారు కాబోతున్నాయని.. మధిరలో జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌, భద్రాచలంలో తెల్లం వెంకటరావు పేర్లు జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఇక వైరానుంచి మాజీ ఎమ్మెల్యే బానోతు మదనలాల్‌కు అభ్యర్థిత్వం ఖరారైందని, ఇల్లెందు నియోజకవర్గాన్ని పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాత్రం తనకే టికెట్‌ అన్న ధీమాతో ఉన్నారు.

రంజుగా వైరా బీఆర్‌ఎస్‌ రాజకీయం

వైరా(ఎస్టీ) నియోజకవర్గంలోని అధికార బీఆర్‌ఎ్‌సలో రాజకీయం యమ రంజుగా మారింది. వైరా విషయంలో రాములునాయక్‌, మదన్‌లాల్‌ మధ్య టికెట్‌ పోరు తీవ్రమైన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మదనలాల్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగులోకి రావడం, ఈ ఫొటోలు మార్ఫింగ్‌ అని, తమ నాయకుడిపై అక్కసుతో ఎమ్మెల్యే రాములునాయక్‌ వర్గీయులు తప్పుడు ప్రచారానికి తెరలేపారని మదనలాల్‌ వర్గీయులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇదే విషయమై మదనలాల్‌ కూడా డీజీపీకి ఫిర్యాదుచేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ హైదరాబాదులో మకాం వేసి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా లభించలేదని తెలిసింది. అయితే మూడు,నాలుగు సార్లు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల ఆధారంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌ను కాదని మదనలాల్‌కు టికెట్‌ ఇవ్వడానికి రంగం సిద్ధమైందని తెలుస్తుండగా.. ఇప్పటికే మదనలాల్‌ వర్గీయులు సంబురాలు కూడా చేసుకున్నారు. అంతేకాకుండా ఓ మంత్రి వైరా నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులకు ఫోన్లు చేసి అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేయాలని, రాములునాయక్‌కు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌, ఇతరత్రా కార్యక్రమాలు చేయడం లాంటివి చేయొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కొత్తగూడెంలో టికెట్‌ టెన్షన

భద్రాద్రి జిల్లాలోని ఏకైక జనరల్‌ సీటైన కొత్తగూడెం బీఆర్‌ఎ్‌సలో టికెట్‌టెన్షన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ఎన్నికపై ఇటవల హైకోర్ట్డు అనర్హత తీర్పు ఇవ్వడం, మళ్లీ ఆయన సుప్రీంకోర్డును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏర్పడిన పరిణామాలతో ఆయనకు మళ్లీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడం కత్తిమీద సాములా మారింది. దీనికి తోడు ఇటీవల అధికార పార్టీని వీడి హస్తం గూటికి చేరిన పొంగులేటి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తారన్న ప్రచారం ఉండటంతో ఈ నియోజకవర్గంపై గులాబీ బాస్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని, పొంగులేటికి దీటైన అభ్యర్థికోసం వేట మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోర్టు తీర్పుతో తానే ఎమ్మేల్యేగా వస్తానని, సిటుంగులే స్థానం అంటే తనకు తప్పక కొత్తగూడెం సీటు లభిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు సీఎం ఆశీస్సులు తనకే ఉన్నాయని, సీటు తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు ముమ్మరంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రెండు వర్గాలు సీటు విషయంలో సిగపట్లు పడుతుంటే అనూహ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డగల శ్రీనివా్‌సరావు జీఎ్‌సఆర్‌ ట్రస్ట్‌ పేరుతో కొద్దినెలలుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఆయన ఆదివారం ‘గడపగడపకు గడల’ పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించడంతో కొత్తగూడెం ఆశావహుల్లో టెన్షన మొదలైంది. రాజకీయమంటేనే సేవ అని, సేవ అంటేనే రాజకీయమని, ఇంటింటికి విద్యా, వైద్యం, ఉపాధి, యువతకు ఉజ్వల భవిష్యత అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. మహిళలకు శ్రావణ మాసం కానుక పేరుతో పసుపు కుంకుమను బహూకరిస్తూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

భద్రగిరిలో ఆసక్తికరంగా పరిణామాలు

డాక్టర్‌తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి తిరిగి చేరిన అనంతరం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకట్రావు కాంగ్రె్‌సలో చేరిన 46రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూడైన బీఆర్‌ఎ్‌సలో చేరడం, అసెంబ్లీ టికెట్‌ తనకే కేటాయించాలంటూ సీఎం కేసీఆర్‌ పాటు మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావు, పువ్వాడ అజయ్‌ను కలిసిన నేపథ్యంలో ఆయకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కబోతోందని, సోమవారం ప్రకటించే తొలి జాబితాలో ఆయన పేరు కచ్చితంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇక భద్రాచలం టికెట్‌ ఆశిస్తున్న వాజేడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, చర్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన బోదెబోయిన బుచ్చయ్య ఆదివారం మణుగూరులో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగాకాంతారావును కలిసి తనకు సహకరించాలని కోరారు. ఇందుకు స్పందించిన రేగా సర్వే ఆధారంగానే టికెట్‌ కేటాయించపు ఉంటుందని, అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే కొంతకాలంగా భద్రాచలం టికెట్‌ ఆశిస్తున్న దుమ్ముగూడెం మండలం కొత్తపల్లికి చెందిన కొర్సా వెంకటేశ్వరరావు వర్గీయులు ఆదివారం సమావేశమై.. వెంకటేశ్వరరావుకు టికెట్‌ ఇవ్వాలని కోరారు.

ఇల్లెందులో కార్చిచ్చు..

ఎమ్మెల్యేపై అసమ్మతి కలకలం

నిన్నమొన్నటి వరకు అంతా బాగానే సాగిన ఇల్లెందు నియోజకవర్గంలో ఒక్కసారిగి తలెత్తిన అసమ్మతి బీఆర్‌ఎస్‌ శ్రేణులను కలవరపెడుతోంది. ఎమ్మెల్యే హరిప్రియకు పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని మునిసిపల్‌ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తదితరులు అధిష్ఠానాన్ని కోరండం సంచలనంగా మారింది. కొద్ది నెలల క్రితం తనపై అవిశ్వాసం తీర్మానం పెట్టడంలో ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌ ప్రొద్బలం ఉందన్న కారణంగా.. దమ్మాలపాటి తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. అదను కోసం చూస్తున్న దమ్మాలపాటి ఎన్నికల సమయాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న లాభియింగ్‌తో హరిప్రియకు టికెట్‌ రాకుండా ప్రయయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో బయ్యారం మండలానికి చెందిన మహబూబాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ ఆంగోతబిందు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె అనురాధ అనురాధాలను అసమ్మతీ వర్గీయులు ప్రత్యామ్నాయంగా తేరమీదకు తెస్తూ.. హరిప్రియకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అసమ్మతి వాదులు చైర్మన డీవీ నివాసంలో సమావేశమవగా.. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిణమాలను సీఎం కెసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎ్‌సకు చెందిన కౌన్సిలర్లతో హైదరబాద్‌ వెళ్లారు. ఇదే సమయంలో మునిసిపల్‌ చైర్మనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే హరిప్రియకు మద్దతుగా 19మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించి హరిప్రియపై కుట్రలు చేస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఇల్లెందులో మొత్తం 24మంది కౌన్సిలర్లకు గాను 21మంది బీఆర్‌ఎ్‌సకు చెందిన వారుకాగా వారిలో 19మంది హరిప్రియకు మద్దతుగా ఉన్నారు. అంతేగాక పలు మండలాలకు చెందిన నాయకులు కూడా ఎమ్మెల్యేకు అండగా నిలుస్తున్నారు.

Updated Date - 2023-08-21T01:20:45+05:30 IST