ఫూలే సంస్కరణలు ఆదర్శనీయం
ABN , First Publish Date - 2023-04-11T23:52:13+05:30 IST
ద్యతోనే సాంఘిక అసమానతలకు అడ్డుకట్ట వేయగలమని, రెండు శతాబ్ధాల క్రితమే ఆ దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహాత్మా జ్యోతిబా ఫూలే నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు.

- జడ్పీ చైర్‌పర్సన్ సరిత
- పూలే మార్గం అనుసరణీయం : కలెక్టర్ వల్లూరు క్రాంతి
- గద్వాలలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
గద్వాల టౌన్, ఏప్రిల్ 11 : విద్యతోనే సాంఘిక అసమానతలకు అడ్డుకట్ట వేయగలమని, రెండు శతాబ్ధాల క్రితమే ఆ దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహాత్మా జ్యోతిబా ఫూలే నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవడమే మహాత్మకు మనం అందించే నిజ మైన నివాళి అని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో దివంగత నాయకుడి విగ్ర హానికి జడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్, మునిసిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్‌లు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన వక్తలు మహిళా విద్యావ్యాప్తి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులు చేసిన కృషి వెలకట్టలేదనిదన్నారు. కార్యక్రమంలో బీసీ సం క్షేమ శాఖ జిల్లా అధికారి ఎంపీ.రమేష్‌బాబు, వైఎస్సాఆర్ టీపీ జిల్లా కోఆర్డినేటర్ అతిక్‌ఉర్ రెహ మాన్, బీఆర్‌ఎస్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వెం కటస్వామి, ఆంజనేయులు, టీజేఎస్ జిల్లా కన్వీనర్ ఆలూరు ప్రకాష్‌గౌడ్, ఎంఐఎం జిల్లా అధ్య క్షుడు షేక్ మున్నాబాషా, ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఆర్.మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- అలంపూర్ చౌరస్తా : అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే అబ్రహం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుల ని ర్మూలనకు ఫూలే చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో డా.అజయ్, నాయకులు ఇటిక్యాల శ్రీనివాసరెడ్డి, తిమోతి, రవి, మద్దిలేటి, రాజు, లోకన్న, సంజన్న తదితరులున్నారు.
కలెక్టరేట్‌లో..
గద్వాల క్రైం : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఫూలే చిత్రపటానికి కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు, పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి రమేష్‌బాబు, అధికారులు ఉన్నారు.