Share News

టీడీపీ నాయకుల సంబురాలు

ABN , First Publish Date - 2023-10-31T22:47:52+05:30 IST

తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

టీడీపీ నాయకుల సంబురాలు

నారాయణపేట వైద్యవిభాగం, అక్టోబరు 31 : తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌, ఓంప్రకాష్‌, వినయ్‌మిత్ర, భీమన్న, వద్ది నారాయణ, రాఘవ, పెంటప్ప, పాల్గొన్నారు.

కోస్గి : టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేసి 54 రోజులుగా రాజమండ్రి జైల్లో పెట్టి మంగళవారం మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయడంతో ఆ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు డీకే రాములు ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌరస్తాలో పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ నాయకులు అచ్యుతారెడ్డి, అమృతరెడ్డి, తలారి శేఖర్‌, సాయిరెడ్డి, మోహన్‌జీ, మాణిక్యప్ప, అంజి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-31T22:47:52+05:30 IST