ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేస్తాం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:38 PM
ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాబో యే రెండున్నర సంవత్సరాలలో శ్రీశైలం లెఫ్టు బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

- రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
దోమలపెంట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాబో యే రెండున్నర సంవత్సరాలలో శ్రీశైలం లెఫ్టు బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉం టుందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణమే నష్టపరిహారం అందించా లని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు ప్రారంభిం చారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిందన్నారు.
తొందరలోనే సహాయ చర్యలు పూర్తి చేస్తాం
ప్రమాద ఘటన జరిగిన నాటి నుంచి 40 రోజులుగా రెస్క్యూ బృందాల్లో 700 నుంచి 800 మంది నిత్యం విశ్రాంతి లేకుండా పనులు కొనసాగిస్తున్నార న్నారు. 250 మీటర్ల వరకు పెద్దపెద్ద బండరాళ్లు, మట్టి దిబ్బలు కూలిపడటం అందులో టీబీఎంకు సంబంధించిన స్ట్రక్చర్ విరిగి పోవడంతో సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్నదన్నారు. ఇప్పటి వరకు 100 మీటర్లకుపైగా శిథిలా లను తొగించినట్లు చెప్పారు. తొందరలోనే సహాయ చర్యలు పూర్తి చేస్తామని పొంగులేటి చెప్పారు. ఇక ముందు సొరంగం పనుల్లో ఎటువంటి ప్రమాదం, ప్రాణనష్టం జరుగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. సొరంగంలో పను ల పురోగతిపై ముఖ ్యమంత్రి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అవసరమైన సహకారం అందించాలని సూచించారన్నారు. బుధవారం సహాయ క చర్యలు, మంత్రి సమీక్షా సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్ కుమార్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి డాక్టర్ హరీశ్, సింగరేణి రెస్క్యూ మైన్స్ జీఎం భైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, జయప్రకాష్, రైల్వే అధికారి రవీంద్రనాథ్, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.