ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థుల సస్పెన్షన్
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:40 PM
నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమా దేవి బుధవారం తెలిపారు.

నాగర్‌కర్నూల్ క్రైం, ఏప్రిల్ 2 (ఆంఽధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమా దేవి బుధవారం తెలిపారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదు వుతున్న విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారితో సమావేశం నిర్వ హించి విద్యార్థి లోకేష్‌కు మూడు నెలలు, హర్షవర్ధన్‌కు రెండు నెలలు, హేమవర్ధన్‌కు నెలరోజుల పాటు సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రిన్సిపాల్ సూచించారు. అస భ్యంగా ప్రవర్తించిన వ్యవహరించిన ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.