పాండురంగ ఆశ్రమంలో వార్షికోత్సవాలు
ABN , First Publish Date - 2023-01-01T23:20:28+05:30 IST
జగదేవ్‌పూర్, జనవరి 1: మర్కుక్ మండలంలోని భవానందపూర్ గ్రామ సమీపంలో గల పాండురంగ ఆశ్రమంలో 89వ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి.

జగదేవ్‌పూర్, జనవరి 1: మర్కుక్ మండలంలోని భవానందపూర్ గ్రామ సమీపంలో గల పాండురంగ ఆశ్రమంలో 89వ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రుక్మిణీ పాండురంగ స్వామి వారికి సూక్త పురుష సూక్తములతో క్షీరాభిషేకం, పుష్పార్చన చేశారు. యధివర భవానందస్వామి పల్లకీసేవ, పాదుకపూజ, మంగళహారతి ప్రసాద్ తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. అలాగే వాసుదేవ ద్వాదశక్షరి మూలమంత్ర హవనము తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో నిర్వహిస్తున్న నామ సప్తాహం ఆరోరోజుకు చేరుకున్నది. రుక్మభట్ల సత్యనారాయణశర్మ, దేశపతి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో రామనామ భజన కొనసాగుతున్నది. ఈ కార్యక్రమానికి చల్లూర్, తరిగొప్పుల నర్మెట్ట, కాల్వపల్లి, బొర్రగూడెం గ్రామాల భక్తులు పాల్గొన్నారు.