ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం

ABN , First Publish Date - 2023-07-27T23:13:54+05:30 IST

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి(35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం

అనారోగ్యంతో పెద్దకొడుకు విష్ణువర్ధన్‌రెడ్డి మృతి

పరామర్శించిన మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ, దయాకర్‌రావు

పటాన్‌చెరు, జులై 27: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి(35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. విష్ణువర్దన్‌రెడ్డి కొంతకాలంగా అనార్యోంతో బాధపడుతూ ఆదివారం చికిత్స కోసం హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. చెట్టంత కుమారుడి ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. విష్ణువర్ధన్‌రెడ్డి మృతితో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పటాన్‌చెరులోని మహిపాల్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించిన ఆయన పలుమార్లు సొమ్మసిల్లిపడిపోయారు. విష్ణువర్దన్‌రెడ్డికి భార్య డాక్టర్‌ కిరణ్మయి, ఐదేళ్ల బాబు, ఏడాది పాప ఉన్నారు. పట్టణ శివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ రమణకుమార్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు వి.భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, చింతా ప్రభాకర్‌, వంటేరు ప్రతా్‌పరెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెత్యే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్‌ సపానాదేవ్‌, శంకర్‌యాదవ్‌, కార్పొరేటర్లు కుమార్‌యాదవ్‌, పుష్పనగే్‌షయాదవ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు వీ.ప్రకా్‌షరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరిఅంజిరెడ్డి, బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌గౌడ్‌ గురువారం సాయంత్రం ఎమ్మెల్యేను పరామర్శించారు.

Updated Date - 2023-07-27T23:13:54+05:30 IST