Minister Errabelli: మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-08-26T12:23:11+05:30 IST

పాలకుర్తి నియోజకవర్గంలో త్వరలో కాంగ్రెస్‌ డబ్బా ఖాళీ అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Minister Errabelli: మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే...

దేవరుప్పుల(జనగామ): పాలకుర్తి నియోజకవర్గంలో త్వరలో కాంగ్రెస్‌ డబ్బా ఖాళీ అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు బబ్బూరి శ్రీకాంత్‌ గౌడ్‌ నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో సుమారు 50 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌(BRS)లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు పల్లా సుందర్‌రామ్‌ రెడ్డి, జగన్‌, కీమా, అశోక్‌, సుమన్‌, యాఖూ, సిద్దూ, గౌతమ్‌, వినోద్‌, ప్రవీణ్‌, వెంకన్న, నితీష్ సాయి తదితరులు పాల్గొన్నారు.

yerra.jpg

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-26T12:23:12+05:30 IST