ఆదానీ కోసం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన మోదీ
ABN , First Publish Date - 2023-03-07T00:10:44+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్నేహితుడు, పారిశ్రామిక వేత్త అయిన ఆదానీ కోసం ప్రజాధనాన్ని దోస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు.

ఆమనగల్లు, మార్చి6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్నేహితుడు, పారిశ్రామిక వేత్త అయిన ఆదానీ కోసం ప్రజాధనాన్ని దోస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ డబ్బును ఆదాని కంపెనీల్లో పెట్టుబడి పెట్టడాన్ని నిరసిస్తూ ఆమనగల్లు ఎస్‌ఐబీ వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి వచ్చిన వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలు క్రమంగా ప్రైవేట్ పరం కావడమో లేక మూత పడడమో జరుగుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలను సాగనంపేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ సభ్యుడు ఐళ్ల శ్రీనివా్‌సగౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి జి.శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్యానాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు మండ్లీ రాములు, డోకూరు ప్రభాకర్‌రెడ్డి, బిచ్యానాయక్, మోతీలాల్, నాయకులు జహంగీర్‌బాబ, వెంకటే శ్, ఖలీల్, దశరథం, మోహన్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, లక్ష్మయ్య, శ్రీశైలం, హీరాసింగ్, జవహర్‌నాయక్, కృష్ణ, ఇమ్రాన్‌బాబ, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, మధు, తులసీరామ్, బాల్‌రాజ్, రాజేశ్, కృష్ణనాయక్, మానయ్య, ఎంఏ. అలీం, ఫరీద్, శ్రీకాంత్, కంబాలపల్లి రామకృష్ణ, అజీం, రాజేందర్, జనార్ధన్‌రెడ్డి, రవి, రమేశ్, తిరుపతిరెడ్డి, రమేశ్, బాబ, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మోదీ, అదానీల దిష్టిబొమ్మల దహనం
షాద్‌నగర్ అర్బన్: పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు షాద్‌నగర్ ఎస్‌బీఐ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మోదీ, అదానీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి వి.శంకర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతూ కమీషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో స్థానానికి ఎగబాకారన్నారు.