రైతులతో మొక్కలు నాటించిన అధికారులు
ABN , First Publish Date - 2023-03-13T23:42:14+05:30 IST
మండలంలోని బాబునాయక్‌తండా పరిధిలోని పల్లె ప్రకృతి వనం మంటలంటుకొని మొక్కలు దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ‘పల్లె ప్రకృతి వనంలో మొక్కలు దగ్ధం’ అనే శీర్షికన గత నెల 28న కథనం ప్రచురితమైంది.

బషీరాబాద్, మార్చి 13: మండలంలోని బాబునాయక్‌తండా పరిధిలోని పల్లె ప్రకృతి వనం మంటలంటుకొని మొక్కలు దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ‘పల్లె ప్రకృతి వనంలో మొక్కలు దగ్ధం’ అనే శీర్షికన గత నెల 28న కథనం ప్రచురితమైంది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించారు. బషీరాబాద్ ఎంపీడీవో రమేష్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి కాలిపోయిన మొక్కలను స్వయంగా పరిశీలించారు. సమీపంలోని వ్యవసాయ పొలాల రైతులు పంట ఉత్పత్తుల వ్యర్థాలు తగలబెట్టడంతో మంటలు వ్యాపించి పల్లెప్రకృతి వనం మొక్కలన్నీ తగలబడినట్లు ఎంపీడీవో గుర్తించారు. స్థానిక సర్పంచ్ సూర్యనాయక్, కార్యదర్శి నరే్‌షతో చర్చించి ఇందుకు బాధ్యులైన రైతులను పిలిపించి దగ్ధమైన మొక్కల విషయమై ప్రశ్నించారు. రైతుల కారణంగానే మొక్కలు ఆగ్నికి అహూతైనట్లు ఎంపీడీవో వివరించగా వారితోనే మళ్లీ మొక్కలు నాటించి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనంలో 110మొక్కలను రెండురోజుల కిందట రైతులతో అధికారులు నాటించారు.