TTDP: అందుకే.. చంద్రబాబుపై జగన్‌రెడ్డి కుట్ర: టీటీడీపీ | TTDP Fires on cm jagan ycp govt VK

TTDP: అందుకే.. చంద్రబాబుపై జగన్‌రెడ్డి కుట్ర: టీటీడీపీ

ABN , First Publish Date - 2023-09-10T17:08:03+05:30 IST

తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) కుట్ర పన్నారని తెలంగాణ తెలుగుదేశం నేతలు(Telangana Telugu Desam Leaders) అన్నారు.

TTDP: అందుకే.. చంద్రబాబుపై జగన్‌రెడ్డి కుట్ర: టీటీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) కుట్ర పన్నారని తెలంగాణ తెలుగుదేశం నేతలు(Telangana Telugu Desam Leaders) అన్నారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం నాడు నిరాహారదీక్షలు చేపట్టారు. నిరసనలో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్(Jubilee Hills Checkpost) వద్ద జగన్‌రెడ్డి దిష్టిబొమ్మను టీటీడీపీ నేతలు దగ్ధం చేశారు. చంద్రబాబుపై రాక్షసానందం కోసం జగన్‌రెడ్డి కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి టీడీపీ నేతలను జెలుకు పంపించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో అభివృద్ధికి కుంటుపడిందని చెప్పారు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై జగన్ అక్రమ కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా కుంగదీయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల ఆలోచించాలి... జగన్మోహన్‌రెడ్డి పాలనకు ఉద్వాసన పలకాలని టీటీడీపీ నేతలు పేర్కొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-10T17:08:03+05:30 IST

News Hub