యువకుడిపై హత్యాయత్నం
ABN , First Publish Date - 2023-01-10T00:14:47+05:30 IST
యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసు కుంది.

మహదేవపూర్, జనవరి 9 : యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసు కుంది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మహదేవపూర్‌కు చెందిన ఆకుల రామదాసు, మండలంలోని బెగ్లూర్ గ్రామా నికి చెందిన ఆకుల మొండి పలు వ్యాపారా లు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమం లో తన భార్యతో ఆకుల రామదాసు ఫోన్‌లో మాట్లాడుతున్నాడని ఆకుల మొండి అనుమా నం పెంచుకున్నాడు. రామదాసును ఎలాగైనా మట్టుపెట్టాలని పథకం రచించాడు. సోమవారం రాత్రి మహదేవపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ వద్ద రామదాసు ఉండగా మొండి అక్కడికి చేరుకున్నాడు. తనతో తెచ్చుకున్న కత్తితో రామదాసుపై దాడి చేశాడు. తప్పించుకొనేందుకు ప్రయత్నించే క్రమంలో రామదాసుకు భుజం, అరచేయి, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు. రామదాసు సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. నిందితుడు మొండి పరారీలో ఉన్నాడుని పేర్కొన్నారు.