స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని నెరవేర్చాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:11 AM
సాలిడ్‌వేస్ట్ ప్రోసెసింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తూ స్వచ్ఛంధ్రా లక్ష్యాన్ని నెరవేర్చాలని ముమ్మిడివరం, ఉప్పలగుప్తం ఈవోపీఆర్డీ సీహెచ్ లక్ష్మీకల్యాణి, జి.రాజ్‌కుమార్ సూచించారు.

ముమ్మిడివరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సాలిడ్‌వేస్ట్ ప్రోసెసింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తూ స్వచ్ఛంధ్రా లక్ష్యాన్ని నెరవేర్చాలని ముమ్మిడివరం, ఉప్పలగుప్తం ఈవోపీఆర్డీ సీహెచ్ లక్ష్మీకల్యాణి, జి.రాజ్‌కుమార్ సూచించారు. అనాతవరం పంచాయతీ పరిధిలోని సాలిడ్‌వేస్ట్ ప్రోసెసింగ్ సెంటర్ షెడ్డు వద్ద శుక్రవారం ఘన వ్యర్థాలపై ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు, పారిశుధ్య సిబ్బందికి నిర్వహించిన శిక్షణ శిబిరంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతీ ఒక్కరు స్వచ్ఛంధ్రాలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో టీపీఆర్సీ పాము వెంకటేశ్వరరావు, అనాతవరం సర్పంచ్ మిమ్మితి చిరంజీవి, పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్రలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.