Telangana: టాయిలెట్స్ శుభ్రం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-03-01T15:36:38+05:30 IST

పాఠశాలలో బాత్రూమ్‌లు (bathroom) అపరిశుభ్రంగా ఉండటంపై హెచ్‌ఎం (HM), అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: టాయిలెట్స్ శుభ్రం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
శుభ్రం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

జనగామ: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పాఠశాల (School) లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రారంభించారు. పాఠశాలలో బాత్రూమ్‌లు (bathroom) అపరిశుభ్రంగా ఉండటంపై హెచ్‌ఎం (HM), అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ముత్తిరెడ్డే స్వయంగా చీపురు పట్టుకుని టాయిలెట్స్ (Toilets) శుభ్రం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పేరుతో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లను ఎంపిక చేసుకుని అభివృద్ధి పనులు ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

Updated Date - 2023-03-01T15:36:38+05:30 IST