పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ABN , First Publish Date - 2023-01-26T23:42:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీ ల్లో ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. వరంగల్‌ పోలీసు క మిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులకు స్థానచల నం కల్పించారు. వరంగల్‌ మామునూరు పోలీసు ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా జగిత్యాల ఎస్పీగా పనిచేస్తున్న సింధూశర్మను నియమించారు.

పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ
సింధూశర్మ

సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా ఎం.ఎ.బారి

ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పి.కరుణాకర్‌

మామునూరు పి.టి.సి. ప్రిన్సిపాల్‌గా సింధూశర్మ

సిటీ పి.టి.సి. ప్రిన్సిపాల్‌గా ఆర్‌.సతీశ్‌

హనుమకొండ క్రైం, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీ ల్లో ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. వరంగల్‌ పోలీసు క మిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులకు స్థానచల నం కల్పించారు. వరంగల్‌ మామునూరు పోలీసు ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా జగిత్యాల ఎస్పీగా పనిచేస్తున్న సింధూశర్మను నియమించారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిపాలన విభాగం, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీగా పనిచేస్తున్న వైభవ్‌ గైక్వాడ్‌కు పదోన్నతి కల్పిస్తూ పెద్దపల్లి డీసీపీగా బదిలీ చేశారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న వెంకటలక్ష్మి సీఐడీ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో డీజీపీ వద్ద వెయిటింగ్‌లో ఉన్న పి.కరుణాకర్‌ (నాన్‌ క్యాడర్‌ ఎస్పీ) వస్తున్నారు. సెంట్రల్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగానికి బదిలీపై వెళ్లారు. సెంట్రల్‌జోన్‌ డీసీపీగా హైదరాబాద్‌ డీజీ అటాచ్‌లో ఉన్న ఎం.ఏ బారి నియమితులయ్యారు. ఇక వరంగల్‌ సీటీసీ (సిటీ పోలీసు ట్రైనింగ్‌ కళాశాల) ప్రిన్సిపాల్‌ పూజ తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో రోడగిరి సతీశ్‌ వస్తున్నారు.

ములుగు ఎస్పీగా గౌస్‌ఆలం

ములుగు కలెక్టరేట్‌: ములుగు జిల్లా ఎస్పీగా గౌస్‌ఆలం నియమితులయ్యారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ను ప్రభుత్వం టీఎ్‌సఆర్టీసీ విజిలెన్స్‌ విభాగానికి బదిలీ చేయగా, ఆ స్థానంలో 2017 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన గౌస్‌ఆలంను నియమించింది. ములుగు ఓఎస్డీగా ఏ టూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆయన స్థానంలో గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా పనిచేస్తున్న సిరిశెట్టి సంకీర్త్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ములుగు ఏఎస్పీగా పనిచేస్తున్న సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ మంచిర్యాల డీసీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవరికీ బా ధ్యతలు అప్పగించలేదు.

Updated Date - 2023-01-26T23:42:41+05:30 IST