మహారాజుకు నీలిరంగు పెట్టె
ABN , Publish Date - May 10 , 2024 | 05:48 AM
భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు ఎన్నికల ప్రచార పత్రాలు ఎలా ఉండేవి అనే దానికి ఫొటో సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక మునుపు మదరాసు శాసన నిర్మాణ సభకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు పోటీ చేసేవారు.
1937లో ఎన్నికల కరపత్రం ఉండేదిలా
1937 నాటి ఎన్నికల కరపత్రం
భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు ఎన్నికల ప్రచార పత్రాలు ఎలా ఉండేవి అనే దానికి ఫొటో సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక మునుపు మదరాసు శాసన నిర్మాణ సభకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు పోటీ చేసేవారు. విజయనగరం సంస్థానం నుంచి మీర్జా రాజా పూసపాటి అలక నారాయణ గణపతి మహారాజు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆ సందర్భంగా ఆయన పేరుతో సంస్థానం ఈనాందారులు కొట్టోజు పెద్దగంగరాజు, జి.వీర్రాజు నాయుడు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. అప్పట్లో ఒక్కో అభ్యర్థికి ఒక్కో రంగు పెట్టె ఉండేదని దీన్ని బట్టి తెలుస్తోంది. గజపతి మహారాజుకు అప్పటి బ్రిటీషు ప్రభుత్వం నీలిరంగు పెట్టెను కేటాయించింది. మహారాజు రెండు స్థానాల్లో పోటీ చేశారు. ప్రభుభక్తితో నీలి రంగుపెట్టేలో రెండు ఓట్లు వేయాలని కోరుతూ 1937 ఫిబ్రవరి 9న ఈ కరపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ ప్రచార పత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
- మచిలీపట్నం టౌన్