Share News

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది

ABN , Publish Date - Aug 03 , 2024 | 12:51 PM

కొవ్వాడ ఎర్ర కాలువలను ఆధునికీకరించడానికి అవసరమైతే కేంద్ర నిధులను తీసుకుని వస్తానని.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువ, తాడిపూడి కాలువ వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది

రాజమండ్రి: కొవ్వాడ ఎర్ర కాలువలను ఆధునికీకరించడానికి అవసరమైతే కేంద్ర నిధులను తీసుకుని వస్తానని.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువ, తాడిపూడి కాలువ వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలువల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నామన్నారు. ప్రస్తుత సీజన్‌లో తుఫాను అధిక వర్షాల ప్రభావంతో 2300 ఎకరాలు ముంపునకు గురయ్యాయన్నారు. ప్రతి సంవత్సరం తుఫాన్ వల్ల 5000 ఎకరాలు రైతులు నష్టపోతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. పంట నష్టం వివరాలను అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు.


రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనే పథకాలు తీసుకొచ్చారని పురందేశ్వరి అన్నారు. రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కేంద్రం ఫసల్ బీమా యోజన, కిసాన్ సమ్మాన్ పథకాలు తీసుకొచ్చారన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోని రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉందని.. రైతుల ఆదుకునే విధంగా పనిచేస్తోంద ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 12:51 PM