వరదకాల్వ నీటిని విడుదల చేయాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:19 AM
వరదకాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మాడ్గులపల్లి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): వరదకాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. వరదకాల్వపై కన్నెకల్, నారాయణపురం, దాచారం, మాడ్గులపల్లి, సీత్యాతండా, తోపుచర్ల వరకు వరదకాల్వపై ఆధారపడి ఉన్నారని రైతులు ఈ వరదకాల్వ మీద ఆధారపడి సాగు చేశారని తెలిపారు. వారం రోజులుగా వరదకాల్వ ద్వారా నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించి ఏప్రిల్ 10 వరకు నీటి విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ విషయంపై అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదని, నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీకర్, దేవిరెడ్డి మల్లారెడ్డి, సీతారాంరెడ్డి, భూపతిరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చారి, రాములు, మల్లయ్య, వెంకన్న ఉన్నారు.