Share News

విద్యుదాఘాతంతో ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:18 AM

ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైరు తగలడంతో ఇంటర్‌ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విద్యుదాఘాతంతో ఇంటర్‌ విద్యార్థి మృతి
మృతి చెందిన దిలీప్‌కుమార్‌

గాజువాక, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైరు తగలడంతో ఇంటర్‌ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇక్కడి శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన జి.దిలీప్‌కుమార్‌ (16) గురువారం మధ్యాహ్నం చినగంట్యాడ నాయుడోరు వీధిలో గల బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమానికి వచ్చాడు. భోజనం చేశాక దిలీప్‌కుమార్‌ సరదాగా మేడపైకి వెళ్లాడు. ఆ సమయంలో అటు, ఇటు తిరుగుతుండగా ఇంటికి ఆనుకుని ఉన్న విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. దీంతో బంధువులు సమీపంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే దిలీప్‌కుమార్‌ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దిలీప్‌ ఇటీవలే ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు రాశాడు. మృతుడి తండ్రి అప్పలరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:20 AM