Share News

డాక్టర్‌ వెళ్లిపోయారు.. రేపు రండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:22 AM

మండుటెండలో వచ్చిన ఆ దివ్యాంగులకు నిరాశే ఎదురైంది. డాక్టర్‌ లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి పోయారు.

డాక్టర్‌ వెళ్లిపోయారు.. రేపు రండి
వైద్యుడి కోసం ఆసుప త్రిలో వేచి ఉన్న దివ్యాంగులు

పాలకొండ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండుటెండలో వచ్చిన ఆ దివ్యాంగులకు నిరాశే ఎదురైంది. డాక్టర్‌ లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి పోయారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పాలకొండ ఏరియా ఆసుపత్రి లో పింఛన్ల పరిశీలనలో భాగంగా తనిఖీలు ఉంటాయని వైద్యాధికారులు వీరఘట్టం మండ లం వాసులకు చెప్పారు. దీంతో 30 మంది దివ్యాంగులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. అయితే వైద్యాధికారి అప్పటికే ఆసుపత్రి నుంచి వెళ్లి పోయారని అక్కడి సిబ్బంది చెప్పారు. అందరినీ శుక్రవారం ఉదయం 8 గంటలకు రావాలన్నారు. దీంతో ఎండలకు అల్లాడుతూ వస్తే రేపు రమ్మనమేంటని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 21 , 2025 | 12:22 AM