SPORTS : సూపర్ ఫుట్‌కప్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:20 AM
ఏపీ సూపర్ ఫుట్‌బాల్ కప్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియం లో గురువారం ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఏపీ పుట్‌బాల్ అసోసి యేషన రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ఉపాధ్యక్షుడు సరిపూటి వేణు గోపాల్ పోటీలను ప్రారంభించారు. తుంగభద్ర జట్టుపై పెన్నా జట్టు 4 గోల్స్ తేడాతో విజయం సాధించగా.... నల్లమల జట్టుపై కోరమాండల్ జట్టు 2 గోల్స్ తేడాతో, గోదావరిపై కొల్లేరు 3గోల్స్, విశాఖపై వంశధార జట్టు 3 గోల్స్ తేడాతో గెలుపొందాయి.

అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ సూపర్ ఫుట్‌బాల్ కప్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియం లో గురువారం ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఏపీ పుట్‌బాల్ అసోసి యేషన రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ఉపాధ్యక్షుడు సరిపూటి వేణు గోపాల్ పోటీలను ప్రారంభించారు. తుంగభద్ర జట్టుపై పెన్నా జట్టు 4 గోల్స్ తేడాతో విజయం సాధించగా.... నల్లమల జట్టుపై కోరమాండల్ జట్టు 2 గోల్స్ తేడాతో, గోదావరిపై కొల్లేరు 3గోల్స్, విశాఖపై వంశధార జట్టు 3 గోల్స్ తేడాతో గెలుపొందాయి. మొట్ట మొదటిగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ఫుట్‌బాల్ క్రీడాకారులను మునుపెన్నడూ లేని విధంగా ఎనిమిది జట్లు (క్లబ్)గా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో పోటీ లు నిర్వహించడం అభినందనీయమన్నారు. విజేత జట్టుకు రూ. 5లక్షలు ఫ్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన సభ్యులు, కోచలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....