Share News

ప్రజలపక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:21 AM

ప్రజలపక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.

ప్రజలపక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
ఎమ్మెల్సీ సత్యంను సన్మానిస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్‌, సీపీఐ నాయకులు

దేవరకొండ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రజలపక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంను నాయకులు దేవరకొండలో పార్టీ కార్యాలయంలో గురువారం సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ పోరాడుతుందన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ మాట్లాడుతూ నెలికంటి సత్యం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. ప్రజాసేవలో రాణించాలని కోరారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో సమాన వాటా కోసం 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా నర్సింహరెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, ప్రజానా ట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను, పల్లె నర్సింహ, దేవేందర్‌రెడ్డి, శ్రవన్‌కుమార్‌, మైనొద్దిన్‌, రాంసింగ్‌, వీరస్వామి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేములపల్లి: ఎమ్మెల్సీగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను మండలంలోని సీపీఐ మండల నాయకులు గురువారం నల్లగొండలో సన్మానిం చారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, జడ భీమయ్య, బుస్క పరమేష్‌, పాల్వాయి సుధాకర్‌, పెదపంగ ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

దామరచర్ల: ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంను సీపీఐ మండల నాయకు లు నల్లగొండలో సన్మానించారు. కార్యక్రమంలో ఽసీపీఐ మండల కార్యదర్శి ధీరావత్‌ లింగానాయక్‌, పోలెపల్లి ఉదయ్‌కుమార్‌, ధీరావత్‌ శాంత, కోటయ్య ఉన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:21 AM