Share News

మాదకద్రవ్యాలతో సంపాదించిన ఆస్తుల జప్తు

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:20 AM

మాదక ద్రవ్యాలతో సంపా దించిన ఆస్తులను జప్తు చేస్తామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి హెచ్చరించారు.

మాదకద్రవ్యాలతో సంపాదించిన ఆస్తుల జప్తు
గంజాయిని నిర్వీర్యం చేస్తున్న డీఐజీ, ఎస్పీలు

లావేరు/బెలగాం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలతో సంపా దించిన ఆస్తులను జప్తు చేస్తామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి హెచ్చరించారు. గంజాయి సమూల నిర్మూలనకు కఠినచర్యలు చేపట్టామన్నారు. ఇటీవల మూడు జిల్లాల్లో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన గంజాయిని.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకాం గ్రామంలోని రైన్‌ బో ఇండస్ట్రీ వద్ద గురువారం డీఐజీ పర్యవేక్షణలో ముగ్గురు ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్‌ జిందాల్‌, ఎస్‌వీ మాధవరెడ్డి నిర్వీర్యం చేశారు. డీఐజీ మాట్లాడుతూ.. ‘విశాఖ రేంజ్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, వాటి మూలాలను గుర్తించి, బాధ్యులపై కేసులు నమోదు చేశాం. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త ఆదేశాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పురం మన్యం జిల్లాల పోలీసులు 226 కేసుల్లో సీజ్‌ చేసిన 7,378 కిలోల గంజాయిని డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వీర్యం చేశాం. అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది జనవరిలో 34,419 కిలోల గంజాయి, 39.4 లీటర్ల హాషిష్‌ ఆయిల్‌ను దహనం చేశాం. రెండో దశలో అల్లూరి సీతా రామరాజు జిల్లాలో గత నెల 3,075 కిలోల గంజాయిని, 25.5 లీటర్ల హాషిష్‌ ఆయిల్‌ను నిర్వీర్యం చేశాం. మూడో దశలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గడచిన 8 నెలల్లో గంజాయి పూర్తిస్థాయి నిర్మూ లనలో భాగంగా 524 కేసుల్లో 31,768 కిలోల గంజాయిని, 120.5 లీటర్ల హాషిష్‌, 372 వాహనాలను సీజ్‌చేసి 2,050 మంది నిందితులను అరెస్ట్‌ చేశాం. ఇందులో 575 మంది అంతరాష్ట్ర నిందితులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికలో రేంజ్‌ పరిధిలో ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించాం. 24 అంతరాష్ట్ర, 14 జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేశాం. డ్రోన్‌ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి, 327 గ్రామాల్లో 90 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని నిర్వీర్యం చేశాం. గంజాయిని అక్రమంగా సాగుచేస్తున్న 34 అంతరాష్ట్ర ముఠా, 21 అంతర జిల్లాల ముఠాలను పట్టుకుని వారిలో 467 మంది ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిందితులుగా గుర్తించాం. ఈ కేసులకు సంబం ధించి 49 మందిపై పీడీ యాక్ట్‌, 1,031 మందిపై గంజాయి సస్పెక్ట్స్‌ షీట్స్‌ తెరిచాం. విశాఖ రేంజి పరిధిలో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ‘సంకల్పం’ పేరిట అవ గాహన కార్యక్రమాలు నిర్వహించి 5 లక్షల మంది విద్యార్థులకు చైతన్యం కలిగించాం. ప్రతి పాఠశాల, కళాశాలలో డ్రాప్‌ బాక్సును ఏర్పా టు చేశాం. 23 గంజాయి కేసుల్లో 40 మందికి న్యాయస్థానాల్లో శిక్ష ఖరారుకాగా, సుమారు 20 మందికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షలు విధించారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించే ఆస్తులను జప్తు చేస్తాం. ఇప్పటికే విజయనగరం, అనకాపల్లి జిల్లాలో చెరొకటి కేసుల్లో ఆస్తులు జప్తుచేశాం. రేంజ్‌ పరిధిలో గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన 86 మందిని డి-అడిక్షన్‌ కేంద్రాలకు పంపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామ’ని తెలిపారు. ‘గంజాయి సాగును నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ పంటలకుగాను రబీ సీజన్‌లో 4.68 ప్లాంట్లలో 22 రకాల విత్తనాలను 11ఎకరాల్లో సాగుకు అందజేశాం. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా 20మండలాల్లో 10,256 మంది రైతులు పంటలు పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే రాజ్మా చిక్కుడు విత్తనాలు 4,496 కిలోలు పంపిణీ చేశామ’ని డీఐజీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీలు పి.శ్రీనివాసరావు, పి.సౌమ్యలత, అంకిత సూరన పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:20 AM