Alert: వీరికే ఉచిత గ్యాస్ సిలిండర్
ABN , Publish Date - Oct 25 , 2024 | 08:06 PM
అక్టోబర్ 29వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం కానుంది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 31న ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేయనున్నారు. అందుకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది.
అమరావతి, అక్టోబర్ 25: రాష్ట్రంలో ఉచిత సిలిండర్ సరఫరాకు ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుందని తెలిపింది. దీంతో అక్టోబర్ 31వ తేదీ దీపావళి సందర్భంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేయనున్నామని తెలిపింది. ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున మొత్తం 3 సిలిండర్లను ఉచితంగా అందించనున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్
Also Read: Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..
Also Read: Cyclone Dana: తీరం దాటిన దానా.. పోర్టుల వద్ద హెచ్చరికలు తొలగింపు
ఈ ఏడాది మే మాసంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రచారం వేళ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఓటరు కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది.
Also Read: Telangana Politics: మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం: జగ్గారెడ్డి
అనంతరం దీపావళి నాటి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫర చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31వ తేదీ దీపావళి. ఆ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ నుంచి గ్యాస్ బుకింగ్ ప్రక్రియా ప్రారంభిస్తారు. అక్టోబర్ 31న ఉచిత సిలిండర్ సరఫరా చేస్తారు. అందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరాకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిన విషయం విధితమే.
Also Read: Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట
Also Read: సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
మరోవైపు ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన హామీలు అమలు చేయడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగో లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని ఆయన వివరించిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News and Telugu News