Share News

Plant ప్రతి ఒక్కరూ ఓ మొక్కనాటి సంరక్షించాలి

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:07 AM

పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు.

Plant ప్రతి ఒక్కరూ ఓ మొక్కనాటి సంరక్షించాలి
విద్యార్థులతో కలిసి మొక్కను నాటిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

మంగళం, ఆగస్టు 30: పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కపిలతీర్థం వద్ద ఉన్న నగర వనంలో జరిగిన వనమహోత్సవంలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. నవంబరు మాసం వరకు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితాన్ని కోరుతూ మొక్కలను నాటాలని కోరారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించారు. మానవ మనుగడకు చెట్లు ఎంతో కీలకమని వాటిని నరకొద్దని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జేసీ శుభం భన్సల్‌, స్టేట్‌ సిల్వి కల్చరిస్టు యశోదబాయ్‌, జూపార్కు క్యూరేటర్‌ సెల్వం, జిల్లా అటవీశాఖ అధికారి సతీష్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, ఫ్లయిండ్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 01:07 AM