యువతిపై లైంగిక దాడి : ముగ్గురిపై కేసు
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:56 AM
తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి మరో యువకుడికి లైంగికంగా సహకరించాలని బెదిరిస్తున్న ముగ్గురిపై సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కేసు నమోదైంది.

మరోసారి సహకరించాలంటూ వేధింపులు
హుజూర్‌నగర్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి మరో యువకుడికి లైంగికంగా సహకరించాలని బెదిరిస్తున్న ముగ్గురిపై సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి లైంగికదాడి, బ్లాక్‌మెయిల్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హుజూర్‌నగర్‌కు చెందిన నూకతొట్టి ప్రమోద్‌కుమార్‌కు స్థానికంగా ఉన్న ఓ యువతితో స్నేహం ఉంది. ఆమె స్నేహితురాలి(26)తో ప్రమోద్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం ఆ యువతిని నీతో మాట్లాడాలని స్థానిక లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించి, ఆమె మత్తులోకి జారుకోగానే లైంగికదాడి చేశాడు. అదే సమయంలో ఆమె న్యూడ్ ఫొటోలు తీసుకుని దాచుకున్నాడు. ఈ నెల 18న మధ్యాహ్నం ప్రమోద్‌కుమార్, స్నేహితురాలితో పాటు అతడి సమీప బంధువు పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన ఎల్.హరీ్‌షలు కలిసి బాధిత యువతిని కారులో ఎక్కించుకుని కోదాడ రోడ్డులోని రిజిస్ట్రేషన కార్యాలయం వైపు తీసుకెళ్లారు. అక్కడ ప్రమోద్‌కుమార్‌తో పాటు హరీ్‌షతో ఒకేసారి శారీరకంగా కలవాలని ముగ్గురు ఆ యువతిపై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే రహస్య ఫొటోలు బయటపెడతామని బెదిరించారు. అందుకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచారు. అదే సమయంలో అక్కడినుంచి పారిపోతుండగా స్థానికులు గమనించారు. దీంతో ప్రమోద్, హరీష్, యువతి స్వామి రోజా అక్కడి పరారయ్యారు. అనంతరం ఆ యువతి పారిపోయి ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు విషయం తెలిపింది. బుధవారం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు. ఈ మేరకు ప్రమోద్, హరీష్, యువతి స్వామి రోజాలపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన యువకులు ఓ రాజకీయ పార్టీకి చెందిన వారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరొక నిందితుడి తండ్రి ఓ రాజకీయ పార్టీకి చెందినవారు కావడంతో యథేచ్ఛగా తిరుగుతున్నాడు.