కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:57 AM
విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సంస్థాన్‌నారాయణపురం ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

కలెక్టర్ హనుమంతరావు
సంస్థాన్‌నారాయణపురం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సంస్థాన్‌నారాయణపురం ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు భయందోళనకు గురి కాకుండా రాయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా సాధన చేయించి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు వారిని సన్నద్ధం చేయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని దరిచేరనీయవద్దని, పదో తరగతి ఫలితాలు విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు లాంటివన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి (కలెక్టరేట్): గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు, రైల్వే, ప్యాకేజీ-14లకు సంబంధించి అవసరమైన భూములను సేకరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రిజర్వాయర్ల నుంచి కాల్వలకు కావాల్సిన ప్రభుత్వ భూములను కూడా సేకరించే పనిలో అధికారులు నిమగ్నం కావాలన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ జీ.వీరారెడి ్డతో కలిసి ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో రిజర్వాయర్లు, కెనాల్స్ రైల్వేకోసం అవసరమైన భూసేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని కల్పించాలి
వలిగొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు.