Share News

మల్లవల్లికి కొత్త కళ

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:01 AM

రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు బుధవారం హనుమాన్‌ జంక్షన్‌లో ఘనస్వాగతం లభించింది. మల్లవల్లిలోని ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌ పార్కులో హిందూజా గ్రూప్‌ అనుబంధ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ స్థాపించిన ఎలక్ర్టికల్‌, డీజిల్‌ బస్సు బాడీబిల్డింగ్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ముందుగా ఇండస్ర్టియల్‌ పార్కుకు రోడ్డు మార్గాన వెళ్తూ.. మార్గంమధ్యలో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు.

మల్లవల్లికి కొత్త కళ
హనుమాన్‌ జంక్షన్‌ వద్ద మంత్రి లోకేశ్‌ అభివాదం

అశోక్‌ లేల్యాండ్‌ బస్‌ బాడీబిల్డింగ్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంతో సందడి

మంత్రి నారా లోకేశ్‌కు అడుగడుగునా నీరాజనం

అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

గజమాలతో టీడీపీ కార్యకర్తల స్వాగతం

హనుమాన్‌ జంక్షన్‌/హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు బుధవారం హనుమాన్‌ జంక్షన్‌లో ఘనస్వాగతం లభించింది. మల్లవల్లిలోని ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌ పార్కులో హిందూజా గ్రూప్‌ అనుబంధ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ స్థాపించిన ఎలక్ర్టికల్‌, డీజిల్‌ బస్సు బాడీబిల్డింగ్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ముందుగా ఇండస్ర్టియల్‌ పార్కుకు రోడ్డు మార్గాన వెళ్తూ.. మార్గంమధ్యలో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి తమలపాకులతో పూజ నిర్వహించారు. మూలవిరాట్‌ విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్కుకు వెళ్లారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వీ పర్యవేక్షణలో ఆలయ ఈవో తారకేశ్వరరావు, అర్చకులు.. లోకేశ్‌కు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు లోకేశ్‌ను భూగర్భ గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, చింతమనేని ప్రభాకర్‌ సారథ్యంలో టీడీపీ బాపులపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఆయనకు నీరాజనాలు పలికారు. లోకేశ్‌కు పుష్పగుచ్ఛాలు అందించడానికి అభిమానులు, నాయకులు ఎగబడ్డారు. నూజివీడు డీఎస్పీ ప్రసాద్‌ ఆలయం వద్ద పోలీస్‌ బందోబస్తును పర్యవేక్షించారు. లోకేశ్‌కు స్వాగతం పలికినవారిలో టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కారదర్శి మూల్పూరి సాయి కల్యాణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతి చిన్నా, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్‌బాబు, టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమావరప్రసాద్‌, ఆళ్ల గోపాలకృష్ణ, కొమ్మారెడ్డి రాజేశ్‌, వీరమాచేనేని సత్యప్రసాద్‌, అట్లూరి శ్రీనివాసరావు, నూలు నరసింహారావు, మొవ్వా వెంకటేశ్వరరావు, వేగిరెడ్డి పాపారావు, చింతల వెంకట శివ అప్పారావు, గండేపూడి నితీష్‌కుమార్‌, వడ్డి వాసవి, కాటుమాల విజయభాస్కర్‌, యనమదల సుధాకర్‌, పుసులూరు లక్ష్మీనారాయణ, లింగం శ్రీధర్‌, దయాల రాజీవ్‌, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేశ్‌కు స్వాగతం పలికారు.

రాష్ట్రానికే గర్వకారణం.. అశోక్‌ లేల్యాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందూజా

మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్‌ లేల్యాండ్‌ ప్లాంటును మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించి ఎంహెచ్‌ఆర్టీసీ (మహారాష్ట్ర) బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో ఎలక్ర్టికల్‌ బస్సుల తయారీకి అనువుగా ఈ యూనిట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా అశోక్‌ లేల్యాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందూజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు ప్రేరణతోనే ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, ఇందుకు చాలా సంతోషిస్తున్నామని చెప్పారు. అశోక్‌ లేల్యాండ్‌ సీఈవో మాట్లాడుతూ కొత్త ప్లాంటు ప్రారంభంతో అశోక్‌ లేలాండ్‌ బస్సు దేశంలోనే మొదటి స్థానాన్ని, ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానాన్ని పటిష్టం చేసుకుందన్నారు. ఈ యూనిట్‌ ప్రారంభించిన మొదటి రోజు నుంచి 100 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభిస్తోందన్నారు. కొత్త ప్లాంట్‌లో అత్యాధునిక పరికరాలు అధికస్థాయి ఆటోమేషన్‌తో అమర్చబడి ఉన్నాయని తెలిపారు. దీనివల్ల అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేయవచ్చని ఆయన చెప్పారు.

Updated Date - Mar 20 , 2025 | 01:01 AM

News Hub